1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
  4. TV Anchor Swetcha Votarkar Found Dead Under Suspicious Circumstances

ప్రముఖ న్యూస్ చానెల్ యాంకర్ ఆత్మహత్య

anchor swetcha
ప్రముఖ న్యూస్ చానెల్ యాంకర్ ఆత్మహత్య చేసుకుంది. మనస్పర్థల కారణంగా భర్తతో విడిపోయి తన తండ్రితో కలిసి ఉంటున్న స్వేచ్ఛ బలవన్మరణానికి పాల్పడింది. గత కొంతకాలంగా పూర్ణచంద్రరావు అనే వ్యక్తితో తన కుమార్తెకు విభేదాలు ఉన్నాయని, ఆయన కారణంగానే తన కుమార్తె ఆత్మహత్య చేసుకుందని స్వేచ్ఛ తండ్రి ఆరోపిస్తున్నారు. 
 
భర్తతో విడిపోయిన తర్వాత పూర్ణచంద్రరావుతో కలిసివుంటున్న తన కుమార్తె.. కొన్ని రోజుల క్రితం కూడా అతనితో కలిసి ఉండలేనని తనతో చెప్పిందన్నారు. తన కుమార్తెను పెళ్లి చేసుకుంటానని చెప్పడం వల్లే పూర్ణచంద్రరావుతో తన కుమార్తె సహజీవనం చేస్తుందని చెప్పింది. 
 
అయితే, పెళ్లి చేసుకోవాలని పలుమార్లు ఒత్తిడి చేసినా పూర్ణ చంద్రరావు కాలయాపన చేస్తూ వచ్చాడని ఈ విషయంలోనే తన కుమార్తె తీవ్ర మనస్తాపానికి గురై ప్రాణాలు తీసుకుందని తెలిపారు. తన కుమార్తె ఆత్మహత్యకు కారణమైన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని యాంకర్ స్వేచ్ఛ తండ్రి డిమాండ్ చేస్తున్నారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
మాజీ మంత్రి కాకాణికి బెయిల్.. మరో రెండు కేసుల్లో రిమాండ్ - కస్టడీ