సంబంధిత వార్తలు
- హోటల్ గదిలో ప్రియుడితో ఉండగా వచ్చిన భర్త... గోడ దూకి పారిపోయిన భార్య
- రూ.లక్ష డిమాండ్ చేసిన విద్యుత్ శాఖ ఎస్ఈ .. రూ.80 వేలు తీసుకుంటూ చిక్కాడు...
- కన్నబిడ్డ ప్రేమను అడ్డుకున్న తండ్రి.. ప్రియుడుతో కలిసి కొట్టి చంపేసిన తల్లీ కూతుళ్లు
- ప్రియుడితో పట్టుబడిన భార్య ... కోపంతో భార్య ముక్కు కొరికేసిన భర్త
- నటి రమ్యశ్రీపై దాడి... పోలీసులకు ఫిర్యాదు.. దాడిచేసింది ఎవరంటే...
ఆఫీసుకు వెళ్లి తిరిగిరాని యువతి... కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్య
హైదరాబాద్ నగరంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రఖ్యాత దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. మృతురాలిని సుష్మ (27)గా గుర్తించింది. ఆఫీసుకు వెళ్లిన ఆ యువతి ఇంటికి తిరిగిరాలేదు. దీంతో ఆ యువతి కోసం గాలించగా దుర్గం చెరువులో శవమై కనిపించింది.
నగరానికి చెందిన సుష్మ బుధవారం రోజున హైటెక్ సిటీలోని తన కార్యాలయానికి వెళ్ళినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే, సాయంత్రం అయినా ఆమె ఇంటికి రాలేదు. దీంతో ఆందోళనకరు గురైన కుటుంబ సభ్యులు ఆమె కోసం గాలించినా ఆచూకీ లభ్యంకాలేదు
ఈ క్రమంలో బుధవారం రాత్రి దుర్గం చెరువు కేబుల్ వంతెన సమీపంలో ఓ మృతదేహం ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందించింది. దీంతో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికి తీసి ఆరా తీయగా, ఆ మృతదేహం సుష్మదిగా నిర్ధారించారు.
సుష్మ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనతో సుష్మ కుటుంబ సభ్యు్ల్లో తీవ్ర విషాదచాయలు అలుముకున్నాయి.
