1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : ఆదివారం, 15 జూన్ 2025 (10:15 IST)

ఉత్తరాఖండ్ గౌరీకుండ్‌లో కూలిపోయిన హెలికాప్టర్: ఏడుగురు మృతి

Helicopter crashes in Uttarakhand Gaurikund
కేదార్‌నాథ్ నుండి గుప్త్ కాశీకి వెళ్తున్న హెలికాప్టర్ ఆదివారం ఉత్తరాఖండ్‌లోని గౌరికుండ్ సమీపంలో అదృశ్యమైంది. ఉత్తరాఖండ్ అదనపు డైరెక్టర్ జనరల్ లా అండ్ ఆర్డర్ డాక్టర్ వి మురుగేషన్ మాట్లాడుతూ... ఆ అదృశ్యమైన హెలికాప్టర్ కూలిపోయిందని ధృవీకరించారు. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు, పైలట్ మరణించారు.
 
కేదార్‌నాథ్ నుండి గుప్త్ కాశీకి వెళ్తున్న VTBKA/BELL 407 హెలికాప్టర్ ఉదయం 5.20 గంటలకు గౌరికుండ్ సమీపంలో కూలిపోయింది. ఉత్తరాఖండ్ పౌర విమానయాన అభివృద్ధి అథారిటీ వెల్లడించిన వివరాల ప్రకారం, హెలికాప్టర్‌లోని ప్రయాణికులు ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్‌కు చెందినవారు. ఘటనా స్థలానికి సహాయక బృందాలను పంపినట్లు అధికారులు వెల్లడించారు.