గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 24 ఆగస్టు 2024 (13:41 IST)

రవితేజ కుడిచేతికి సర్జరీ.. ఆరు వారాల పాటు విశ్రాంతి అవసరం..

Ravi Teja
Ravi Teja
టాలీవుడ్ స్టార్ హీరో రవితేజకు తీవ్రగాయాలైనాయి. ఆయన కుడి చేతికి వైద్యులు సర్జరీ చేశారు. ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని ఆయనకు వైద్యులు సూచించారు. వివరాల్లోకి వెళితే.. తన తాజా చిత్రం 'ఆర్‌టీ 75' షూటింగ్ సమయంలో ఇటీవల రవితేజ గాయపడ్డారు. అయితే గాయాన్ని లెక్క చేయకుండా ఆయన షూటింగ్‌లో పాల్గొన్నారు. 
 
ఈ క్రమంలో గాయం మరింత తీవ్రం కావడంతో.. చివరకు ఆయన చేతికి డాక్టర్లు సర్జరీ చేశారు. రవితేజ త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షిస్తున్నారు. 
 
ఇకపోతే... 'సామజవరగమన' చిత్రానికి రచయితగా పని చేసిన భాను భోగవరపు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. హీరోయిన్‌గా శ్రీలీల నటిస్తోంది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.