గురువారం, 19 సెప్టెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 16 ఆగస్టు 2024 (11:38 IST)

మిస్టర్ బచ్చన్ అట్టర్ ప్లాప్ కు కారణం ఇదేనా?

Harish, raviteja, bhagya sri
Harish, raviteja, bhagya sri
రవితేజ, హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన మిస్టర్ బచ్చన్ చిత్రం ఇప్పటి ట్రెండ్ కు అనుణంగా లేదని ట్రేడ్ వర్గాలు విశ్లేషించాయి. 80దశకంలో జరిగిన కథను తీసుకుని బాలీవుడ్ రైడ్ అనేది తీశారు. దానిని 2024లో తీయడం ప్రధాన లోపంగా కనిపిస్తుంది. ఇప్పటి జనరేషన్ కు అమితాబ్ సీనియర్ నటుడు. ఆయన అభిమానులుగా హీరో దర్శకుడు చేశారు. ఇందులో మరో లోపం ఏమంటే.. హీరోయిన్ భాగ్య శ్రీ బోర్సే ఎక్స్ పోజింగ్ కు మాత్రమే పరిమితం కావడమే. 
 
ఇక రవితేజ ఈ సినిమాలో చాలా కష్టపడ్డాడు. డాన్స్ లు ఫైట్స్ బాగా చేశాడు. చాలా సన్నివేశాలు ఫక్తు సినిమాటిక్ గా వున్నాయి. జగపతిబాబు, రవితేజ కాంబినేషన్ పాత ఫార్మెట్ లోనే సీన్స్ రాసుకున్నాడు దర్శకుడు. రవితేజ చాలా ఎనర్జిక్ గా వున్నా, నల్లంచు తెల్లచీర పాటలో హీరో ఏజ్ స్పష్టంగా కనిపిస్తుంది. 
 
ఇక హీరోయిన్ మార్వాడీ కుటుంబంనుంచి వచ్చిన అమ్మాయి. ఆమెకు రవితేజ అంటే పిచ్చి. అదెలాగంటే విరహం అనుభవిస్తున్న అమ్మాయి.. హీరోను చూడగానే పీల్చి పిప్పి చేస్తుంది. అంటే.. తెగ ముద్దులు పెట్టేసుకుంటుంది. ఇక పాటల్లో ఎక్స్ పోజింగ్ కు మాత్రమే ఆమె పనికి వచ్చింది. తను కూడా దేనికైనా రెడీ అనేట్లుగా నటించింది. నటిగా వచ్చిన పాత్రకు న్యాయం చేయడమే తన పని అని నిర్మొహమాటంగా చెప్పేసింది. అంతవరకు బాగానే వుంది. కానీ కథలో ఆ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేనప్పుడు ఇలాంటి రికార్డింగ్ డాన్స్ తరహాలో ఆమె క్యారెక్టర్ వుంది. 
 
దర్శకుడు ఒకప్పటి మాస్ సినిమాను పాతకాలపు తరహాలో తీశాడు. దర్శకత్వంలో నేటి జనరేషన్ కు తగినట్లుగా ఎదగలేకపోవడం ప్రధాన లోపంగా కనిపిస్తుంది.