సంబంధిత వార్తలు
విజువల్ గ్రాఫిక్స్ హైలైట్ గా శ్రద్ధాదాస్ త్రికాల చిత్రం
Shraddhadas - Trikala
భారీ బడ్జెట్‌తో ఫాంటసీ, హారర్ జోనర్ మూవీగా కుమారి ఖండం నేపథ్యాన్ని ఆధారంగా చేసుకుని, నేటి కాలానికి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసి సినిమాను తెరకెక్కించారు. కుమారి ఖండాన్ని పరిచయం చేస్తూనే మూల కథకు పురాణ నేపథ్యంతో పాటు నూతన హంగులను అద్దుతూ టీమ్ సినిమాను ఆవిష్కరించింది. దేవి చిత్రంలో బాల నటుడిగా మెప్పించిన మాస్టర్ మహేంద్రన్ ఈ చిత్రంతో ప్రధాన పాత్ర దారుడుగా మీ ముందుకు వస్తున్నారు. సరికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించేలా ఈ సినిమాను దర్శకుడు మణి తెల్లగూటి అండ్ టీమ్ రూపొందిస్తున్నారు. త్వరలోనే మరికొన్ని విశేషాలను తెలియజేస్తామని చిత్ర యూనిట్ తెలియజేసింది.
