సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేయాలనుకుంటే ఏమైంది ?
జయసుధ, సుమన్, ఇంద్రజ, అజయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "సీఎం పెళ్లాం". ఈ చిత్రాన్ని ఆర్.కే సినిమాస్ బ్యానర్ పై బొల్లా రామకృష్ణ నిర్మిస్తున్నారు. దర్శకుడు గడ్డం వెంకట రమణరెడ్డి రూపొందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో "సీఎం పెళ్లాం" సినిమా టీజర్ లాంఛ్ సోమవారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో నిర్వహించారు.
దర్శకుడు గడ్డం వెంకటరమణ రెడ్డి మాట్లాడుతూ, రాజకీయ నేపథ్యంతో సాగే మంచి సందేశాత్మక చిత్రమిది. ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తూనే ఆలోచింపజేస్తుంది. మనం ఒకే ఒక్కడు సినిమాలో ఒక్కరోజు ముఖ్యమంత్రి కావడం చూశాం. మా మూవీలో సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేసేందుకు ముందుకొస్తే ఎలా ఉంటుందనేది చూపిస్తున్నాం. చాలా మంచి ప్రయత్నం చేశాం. ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నా. అన్నారు.
నిర్మాత బొల్లా రామకృష్ణ మాట్లాడుతూ, మహిళా సాధికారత గురించి కూడా కంటెంట్ ఉంటుంది. సుమన్ గారు, ఇంద్రజ, అజయ్ గారితో మూవీ చేయడం హ్యాపీగా ఉంది. ఒక మంచి ప్రయత్నం చేశాం. మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. అన్నారు.
నటుడు సుమన్ మాట్లాడుతూ - సీఎం పెళ్లాం సినిమాలో నేను పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేశాను. రొటీన్ కు భిన్నమైన పాత్రలో కనిపిస్తా. చాలా మంచి స్క్రిప్ట్ ఇది. డైరెక్టర్ వెంకటరమణారెడ్డి పూర్తి స్క్రిప్ట్ తో ప్రతి డీటెయిల్ తో రెడీ అయ్యి సినిమా చేశారు. ఆయన డెడికేషన్ నాకు నచ్చింది. నాతో పాటు ఇంద్రజ, అజయ్ ప్రధాన పాత్రలు చేశారు. అజయ్ మంచి నటుడు, అతను ఇంకా గొప్ప పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నా. ఇంద్రజ గతంలో నాతో పాటు హీరోయిన్ గా నటించింది. ఆమెతో మళ్లీ మూవీ చేయడం హ్యాపీగా ఉంది. చాలా మంచి ఆర్టిస్టులు ఈ సినిమాకు కుదిరారు. మన రాజకీయ, బ్యూరోక్రాట్ వ్యవస్థను ప్రశ్నిస్తూ ఒక మంచి మూవీ చేశారు దర్శకుడు గడ్డం వెంకటరమణ రెడ్డి. ఈ సినిమాకు మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నా. అన్నారు.
నటి ఇంద్రజ మాట్లాడుతూ - సుమన్ గారితో ఎన్నో మూవీస్ చేశాను. ఆయన మంచి మనసు అప్పుడు ఇప్పుడూ ఒకేలా ఉంది. ఆయన అప్పటికే స్టార్ హీరో అయినా కొత్త హీరోయిన్ గా వచ్చిన నాతో ఎంతో గౌరవంగా మాట్లాడేవారు. సీఎం పెళ్లాం క్యారెక్టర్ లో సీఎం భార్య పాత్రలో నటించాను. ఈ పాత్రను నేను చేయగలను అని నాకు అవకాశం ఇచ్చిన దర్శకుడు గడ్డం వెంకటరమణరెడ్డికి థ్యాంక్స్ చెబుతున్నా. ఇదొక ప్రత్యేకమైన సినిమా. మంచి సందేశాన్ని ఇస్తుంది అన్నారు.
నటుడు అజయ్ మాట్లాడుతూ, ఈ సినిమాలో నేను లీడ్ రోల్ చేశాను. ఇది మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ. పాలిటిక్స్ ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే సమాజానికి మంచి జరుగుతుంది అని చెప్పే చిత్రమిది. అలాగే మహిళా సాధికారత గురించి కూడా మా డైరెక్టర్ చూపించారు.ఇంద్రజ గారు ఈ సినిమాలో హీరో అని చెప్పాలి. ఒక మంచి మూవీ చేశాం. మీరంతా ఆదరిస్తారని కోరుకుంటున్నా. అన్నారు.
నటుడు అలీ మాట్లాడుతూ - దర్శకుడు గడ్డం వెంకటరమణ రెడ్డి 20 ఏళ్ల కిందట ప్రకాష్ రాజ్ గారితో ఓ సినిమా రూపొందించాడు. ఆ తర్వాత యూఎస్ఏ వెళ్లిపోయాడు. అక్కడ బాగా స్థిరపడ్డాడు. కానీ సినిమా మీద ప్యాషన్ ఉండనీయదు కదా మళ్లీ వచ్చాడు. సీఎం పెళ్లాం అనే మంచి మూవీ రూపొందించాడు. ఈ సినిమా ఆయనకు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నా. అన్నాడు.
నటుడు సురేష్ కొండేటి మాట్లాడుతూ - ఈ సినిమాలో నేను హోం మంత్రి పాత్రలో నటించాను. పొలిటికల్ నేపథ్యంతో సాగే ఒక మంచి చిత్రమిది. ఈ చిత్రంలో ఇంద్రజ, సుమన్, అజయ్ గారితో కలిసి నటించడం హ్యాపీగా ఉంది. డైరెక్టర్ గడ్డం వెంకటరమణ రెడ్డి గారికి, ప్రొడ్యూసర్ బొల్లా రామకృష్ణ గారికి థ్యాంక్స్. అన్నారు.