బుధవారం, 11 సెప్టెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 13 ఆగస్టు 2024 (09:44 IST)

ఇండస్ట్రీ లోని కొత్తవారిలో సృజనాత్మకు లక్ష్యంగా స్పూర్తి వనం : డాక్టర్ నరేష్ విజయకృష్ణ

naresh 50 years celebrations guests
naresh 50 years celebrations guests
వెర్సటైల్ యాక్టర్ డాక్టర్ నరేష్ విజయకృష్ణ 50 సంవత్సరాల గోల్డెన్ జూబ్లీ పూర్తి చేస్తుకున్న సందర్భంగా ఇండస్ట్రీ ప్రముఖులు, నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, స్నేహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో గ్రాండ్ గా గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ జరిగాయి 
 
గోల్డెన్ జూబ్లీ వేడుకల సందర్భంగా విజయకృష్ణ మందిర్ & ఘట్టమనేని ఇందిరాదేవి స్పూర్తి వనాన్ని ఇనాగరేట్ చేశారు. ముఖ్య అతిథిగా తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ శ్రీమతి సూరేపల్లి నంద గారు పాల్గొన్నారు. న్యాయమూర్తి శ్రీ ఎన్ మాధవరావు గారు, తెలంగాణ హైకోర్టు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీ సూరేపల్లి ప్రశాంత్ గారు,హీరో జాకీ ష్రాఫ్, హీరోయిన్ పూనమ్ ధిల్లాన్, జయసుధ, సుహాసిని, మణిరత్నం కుష్బూ, ఇతర ప్రముఖులు గౌరవ అతిథులుగా హాజరయ్యారు. 
 
శ్రీమతి సూరే పల్లి నంద గారు మాట్లాడుతూ.. ఈ పార్క్ పాస్ట్ అండ్ ఫ్యూచర్ జనరేషన్స్ కి మధ్య అద్భుతమైన వారధి అన్నారు. 
 
భావి తరం ఫిల్మ్ మేకర్స్ కి, ప్రజలకు ఇది తన కానుక ని డాక్టర్ నరేష్ విజయకృష్ణ ప్రసంగంలో పేర్కొన్నారు. చిత్ర పరిశ్రమకు కృషి చేసిన దిగ్గజాలందరికీ స్మారక చిహ్నంగా రూపొందించబడిన స్పూర్తి వనం సూపర్ స్టార్ కృష్ణ, విజయ నిర్మల విగ్రహాలతో ప్రారంభించబడింది. 
 
స్పూర్తి వనం యువ రచయితలు, దర్శకులు, సంగీత దర్శకుల కోసం సృజనాత్మక వాతావరణాన్ని సృష్టించడం లక్ష్యంగా పెట్టుకుంది. భవిష్యత్తులో ఫిల్మ్ లైబ్రరీ , మ్యూజియంను హోస్ట్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారు.ఇది అభిమానులకు, ప్రజలకు ఓపెన్ గా వుంటుంది.  
 
ఈవెనింగ్ మీట్ అండ్ గ్రీట్ రిసెప్షన్ లో నరేష్ విజయకృష్ణ, పవిత్ర లోకేష్ & జయసుధలను మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా), మాదాల రవి, శివబాలాజీ, మహారాష్ట్ర సినీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీమతి పూనమ్ ధిల్లాన్, ప్రముఖ హీరో జాకీ ష్రాఫ్ సుహాసిని మణిరత్నం, కుష్బూ, ప్రముఖ నటులు సత్కరించారు.
 
హీరో సాయి దుర్గా ధరమ్ తేజ్, హీరో మనోజ్ మంచు, నారా రోహిత్, దర్శకుడు మారుతి, దర్శకుడు అనుదీప్, సాయిరామ్ అబ్బిరాజు, యాక్టర్ అలీ, సంగీత దర్శకుడు కోటి, దర్శకుడు సతీష్ వేగేశ్న నిర్మాతలు శరత్ మరార్, రాధ మోహన్ తో పాటు తెలుగు, హిందీ, తమిళ పరిశ్రమలకు చెందిన పలువురు ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు. 26 అంతర్జాతీయ అవార్డులను గెలుచుకున్న సాయి ధరమ్ తేజ్ & కలర్స్ స్వాతి నటించిన నవీన్ విజయకృష్ణ మూవీ ‘సత్య’ చిత్రాన్ని స్క్రీన్ చేశారు, సినిమా చాలా మంచి ప్రశంసలు అందుకుంది.