1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 4 అక్టోబరు 2023 (16:05 IST)

జైలర్ ఖాతాలో అరుదైన రికార్డు.. బంగ్లాదేశ్‌లో సూపర్ స్టార్ సినిమా

jailer
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ ద్వారా బంపర్ హిట్ కొట్టారు. ఇది బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మలయాళం నుండి మోహన్ లాల్, కన్నడ చిత్ర పరిశ్రమ నుండి శివ రాజ్ కుమార్ వంటి పెద్ద స్టార్స్ కూడా నటించారు. ఇప్పటికే ఈ సినిమా థియేట్రికల్‌గా ఎన్నో భారీ రికార్డులతో అరుదైన ఘనత సాధించగా, తాజాగా మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. 
 
రజనీకాంత్ నటించిన జైలర్ ఇప్పుడు బంగ్లాదేశ్‌లో విడుదలైన మొదటి తమిళ చిత్రంగా నిలవనుంది. ఇక అక్టోబర్ 10న గ్రాండ్‌గా జైలర్‌ను బంగ్లాదేశ్‌లో రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ భారీ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించగా సన్ పిక్చర్స్ నిర్మించింది.
 
 
 
రజనీకాంత్‌తో పాటు, జైలర్‌లో మిల్కీ సైరన్ తమన్నా భాటియా, సునీల్, రమ్య కృష్ణన్, జాకీ ష్రాఫ్, యోగి బాబు కూడా ముఖ్య పాత్రల్లో నటించారు. సినిమా విడుదలైనప్పటి నుండి ఈ యాక్షన్ డ్రామా జైలర్ చుట్టూ ఉన్న హైప్‌ఒక మెట్టు పెంచింది. ఈ చిత్రంలో రజనీ జైలర్ 'టైగర్' ముత్తువేల్ పాండియన్ పాత్రను పోషించారు.