సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 30 సెప్టెంబరు 2023 (11:06 IST)

వరల్డ్ కప్ వార్మప్ మ్యాచ్‌.. కివీస్ అద్భుతం.. పాకిస్థాన్‌పై ఘనవిజయం

world cup
వరల్డ్ కప్ వార్మప్ మ్యాచ్‌లో కివీస్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఐదు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 345 పరుగులు చేసింది. 
 
మహ్మద్ రిజ్వాన్ 103, కెప్టెన్ బాబర్ అజామ్ 80, సాద్ షకీల్ 75 పరుగులు చేశారు.  అనంతరం లక్ష్య ఛేదనకు బరిలోకి దిగి  కివీస్ కేవలం 43.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 346 పరుగులు చేసి పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. 
 
కివీస్ ఇన్నింగ్స్‌‌లో యువ ఆల్ రౌండర్ రచిన్ రవీంద్ర ఇన్నింగ్స్ ఈ మ్యాచ్‌కు హైలైట్‌గా నిలిచింది. 23 ఏళ్ల రచిన్ రవీంద్ర ఓపెనర్‌గా వచ్చి 97 పరుగులు సాధించాడు తద్వారా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.