శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 3 అక్టోబరు 2023 (18:48 IST)

జైలర్ తర్వాత తలైవర్ 170: ట్రాక్‌లో వున్న ఆ ముగ్గురు హీరోయిన్లు?

Thalaivar 170
Thalaivar 170
ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తన ఇటీవలి బ్లాక్ బస్టర్ "జైలర్" తర్వాత రజనీకాంత్ మళ్లీ ట్రాక్‌లోకి వచ్చారు. ప్రస్తుతం టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన ఒక యాక్షన్-ప్యాక్డ్ డ్రామా కోసం సూపర్ స్టార్ సిద్ధం అవుతున్నారు. 
 
ఈ చిత్రానికి తాత్కాలికంగా "తలైవర్ 170" అని పేరు పెట్టారు. ఇది ఇప్పటికే మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. తాజా సమాచారం ప్రకారం రితికా సింగ్, మంజు వారియర్, దుషార విజయన్ రజనీకాంత్‌ 170 చిత్రంలో కీలక పాత్రల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. 
 
ఈ సినిమాకు లైకా ప్రొడక్షన్స్ నిర్మాణ బాధ్యతలు చేపడుతోంది. జైలర్ చిత్రానికి సంగీతం సమకూర్చిన అనిరుధ్ రవిచందర్‌ రజనీకాంత్ 170 సినిమాకు కూడా సంగీత దర్శకుడి బాధ్యతలు చేపట్టనున్నారు.