ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 5 సెప్టెంబరు 2023 (11:56 IST)

జైలర్ సక్సెస్- అనిరుధ్‌కు పోర్షే కారు బహుమతి

Anirudh
Anirudh
సూపర్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జైలర్. జైలర్ ఆగస్ట్ 10న విడుదలైంది. ఇప్పటివరకు ఈ సినిమా రూ. 525 కోట్లకు పైగా వసూలు చేసిందని చిత్ర నిర్మాత సన్ పిక్చర్స్ తెలిపింది.
 
ఇదిలా ఉండగా, జైలర్ సక్సెస్ తర్వాత నిర్మాత కళానిధి మారన్ సంగీత దర్శకుడు అనిరుధ్‌కు చెక్‌తో పాటు సరికొత్త పోర్షే కారును బహుమతిగా ఇచ్చారు. ఈ కారు ధర రూ. 1.44 కోట్లు ఉంటుందని చెప్పారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
 
ఇప్పటికే రజనీకాంత్‌కు రూ.1.24 కోట్ల బీఎండబ్ల్యూ ఎక్స్7 కారుతో పాటు రూ.100 కోట్ల చెక్కును కూడా అందించారు. డైరక్టర్ నెల్సన్‌కు కూడా పోర్చే లేటెస్ట్ కారు (porsche Car)ను, చెక్కును అందజేసిన సంగతి తెలిసిందే.