బుధవారం, 28 ఫిబ్రవరి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 2 సెప్టెంబరు 2023 (20:05 IST)

సెప్టెంబరు 7 నుంచి అమేజాన్ ప్రైమ్‌లో జైలర్ స్ట్రీమింగ్

jailer
జైలర్ సినిమా రూ.600 కోట్ల వసూళ్లతో దూసుకుపోతోంది. జైలర్ ఓటీటీ విడుదలకు ముహూర్తం ఖరారైంది. సెప్టెంబరు 7 నుంచి జైలర్ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. 
 
జైలర్ చిత్రం ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఎదురుచూస్తున్న తలైవా అభిమానులకు, సినీ ప్రియులకు ఇది శుభవార్తే. ఈ సినిమా తెలుగు తమిళం, హిందీ, కన్నడ, మలయాళీ భాషల్లో అదే రోజు స్ట్రీమింగ్ కానుంది. 
 
ఇక ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందించారు. జాకీ ష్రాఫ్, శివ రాజ్‌కుమార్, నాగేంద్ర బాబు, రమ్య కృష్ణన్, సునీల్, వసంత్ రవి, యోగి బాబు కీలకపాత్రల్లో నటించారు. 
 
ఈ సినిమాలో రజినీకాంత్ పవర్ఫుల్ రోల్‌లో కనిపించారు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ గ్రాండ్ లెవెల్లో నిర్మించారు. ఇక జైలర్ కథ విషయానికి వస్తే.. టైగర్ ముత్తువేల్ పాండియన్ అనే రిటైర్డ్ జైలర్ చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది.