శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 11 సెప్టెంబరు 2023 (16:00 IST)

లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో రజినీకాంత్ 171వ చిత్రం

rajini - lokesh
సూపర్ స్టార్ రజినీకాంత్ మరో చిత్రానికి కమిట్ అయ్యారు. ఇటీవల వచ్చిన "జైలర్" చిత్రం మెగా బ్లాక్ బస్టర్ సాధించి కనక వర్షం కురిపిస్తుంది. ఈ చిత్రం విజయంతో ఆయన మరో చిత్రంలో నటించేందుకు సమ్మతించారు. కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ లోకే‌శ్ కనకరాజ్ ఈ చిత్రానికి డైరెక్ట్ చేయనున్నారు. కమల్ హాసన్ నటించిన "విక్రమ్" చిత్రాన్ని కూడా లోకేశ్ కనకరాజ్ దర్శత్వం వహించిన విషయం తెల్సిందే. ఇది కమల్ హాసన్ సినీ కెరీర్‌లోనే కలెక్షన్లపరంగా ఆల్‌టైమ్ రికార్డుగా నిలించింది. 
 
ఈ నేపథ్యంలో రజినీ నటించే 171వ చిత్రాన్ని 'జైలర్' నిర్మాత కళానిధి మారన్ తన సొంత బ్యానర్ సన్ పిక్చర్స్ పతాకంపై నిర్మించనున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం సమకూర్చనున్నారు. అయితే, ఈ చిత్రం పట్టాలెక్కేందుకు రెండేళ్లు పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే.. రజినీకాంత్ 170వ చిత్రం పూర్తి కావాల్సివుంది. అలాగే, విజయ్ హీరోగా లోకేశ్ కనకరాజ్ రూపొందిస్తున్న "లియో" విడుదలకావాల్సి ఉంది. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత రజినీ 171 సెట్స్‌పైకి వెళ్లనుంది.