Soundarya Rajinikanth: సూపర్‌స్టార్ రజనీకాంత్ ఆత్మ కథను రాయనున్న సౌందర్య
Superstar Rajinikanth, Soundarya Rajinikanth
ఇక, రజనీకాంత్ ఐదు దశాబ్దాల సినీ ప్రయాణంలోని విజయాలు, వ్యక్తిగత అనుభవాలు, అగ్రస్థానానికి చేరుకునే క్రమంలో వుంటుంది. పరమహంస యోగానంద రాసిన ఒక యోగి ఆత్మకథ పుస్తకంలాగే ఈ పుస్తకం కూడా తరతరాలకు స్ఫూర్తినిస్తుందని సౌందర్య నమ్మకం వ్యక్తం చేశారు. ఒకవేళ తన తండ్రి జీవితాన్ని సినిమాగా తెరకెక్కించే అవకాశం వస్తే అది తనకు అత్యంత ప్రత్యేకమైన విషయమని ఆమె తెలిపారు.
ఇందులో తనకు స్పూర్తిని, విజ్నానాన్ని నేర్పిన గురువులా తన తండ్రి పయనం వుంటుంది. ఆ విషయాలు కూడా ఇందులో స్పష్టంగా వుంటాయని పేర్కొంది. జీవితంలో క్రమశిక్షణ చాలా ముఖ్యమని తన తండ్రి నేర్పించారని పేర్కొన్నారు.
ప్రస్తుతం సౌందర్య నిర్మాణంలో నెట్‌ఫ్లిక్స్ కోసం లవ్ అనే రొమాంటిక్ తమిళ వెబ్‌సిరీస్ రూపొందుతోంది. బాలాజీ మోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్‌లో అర్జున్ దాస్, ఐశ్వర్య లక్ష్మి ప్రధాన పాత్రలు పోషిస్తుండగా... ఇది అక్టోబరులో నెట్‌ఫ్లిక్స్ వేదికగా విడుదల కానుంది.

