1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. SS Rajamouli Speech in Thellavarithe Guruvaram Pre Release Event at Hyderabad

తెల్లవారితే గురువారం సినిమా గురించి మీరే చెప్పాలి : రాజమౌళి

SS Rajamouli
తన అన్న, ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి తనయుడు శ్రీసింహా హీరోగా తెరకెక్కిన చిత్రం తెల్లవారితే గురువారం. ఈ చిత్రం ప్రీరిలీజ్ వేడుక ఆదివారం హైదరాబాద్ నగరంలో జరిగింది. ఇందులో దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి పాల్గొని మాట్లాడుతూ, 'ఈ సినిమా టీజర్‌, పాటలు, ట్రైలర్‌ చాలా బాగున్నాయి. ఇంట్లో వాళ్లు ఏం చేసినా బాగుందనిపిస్తుంది కాబట్టి సినిమా గురించి ప్రేక్షకులే చెప్పాలనుకుంటున్నా. 
 
సినిమా చాలా రిచ్‌గా అనిపిస్తోంది. నిర్మాతలు మంచి ప్రొడక్షన్‌ వాల్యూస్‌తో తీశారు. తొలి సినిమా అయినప్పటికీ దర్శకుడు కాన్ఫిడెంట్‌తో హ్యాండిల్‌ చేశాడు' అని చెప్పుకొచ్చారు. అలాగే, కీరవాణి మాట్లాడుతూ, 'ఈ పనే చేయమని మా పిల్లలకు చెప్పను. వాళ్లకు నచ్చింది చేసే స్వేచ్ఛ ఇచ్చా' అని అన్నారు. 
 
కాగా, ఈ చిత్రానికి మణికాంత్‌ జెల్లీ దర్శకత్వం వహించగా, మిషా నారంగ్‌, చిత్రా శుక్లా హీరోయిన్లుగా నటించారు. రజని కొర్రపాటి, రవీంద్ర బెనర్జీ ముప్పనేని నిర్మాతలు. కాలభైరవ సంగీతాన్ని అందించాడు. ఈ నెల 27న విడుదలకానుంది. ఈ చిత్రం ప్రీరిలీజ్ కార్యక్రమం ఆదివారం హైదరాబాద్ నగరంలో జరిగింది. దీనికి టాలీవుడ్ అగ్ర హీరో జూనియర్ ఎన్టీఆర్, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 
తర్వాతి కథనం
జక్కన్న ఫ్యామిలీ నాకు దేవుడిచ్చిన వరం : జూనియర్ ఎన్టీఆర్