గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: బుధవారం, 24 ఫిబ్రవరి 2021 (22:32 IST)

సైనికులై సాగుదాం, టిడిపిని లేకుండా చేస్తాం: కార్యకర్తలకు రోజా పిలుపు

ఎపిఐఐసి ఛైర్ పర్సన్, నగరి ఎమ్మెల్యే రోజా తన సొంత నియోజకవర్గంలో చురుగ్గా పర్యటిస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా సర్పంచ్ ఎన్నికల్లో గెలుపొందిన వారిని ఘనంగా సన్మానించారు. ఓడిపోయిన వైసిపి కార్యకర్తలు, నాయకులకు ధైర్యం చెబుతున్నారు.
 
నగరిలోని వడమాలపేట ఎండిఓ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎపిఐఐసి ఛైర్ పర్సన్ రోజా పాల్గొని పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన వారిని ఘనంగా సన్మానించారు. గెలిచిన వారికి అభినందనలు.. ఓడినవారు అధైర్యపడకండి అంటూ ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు.
 
ఎవరూ ఆవేదనకు గురికాకండి.. పోరాటం చేశాం.. గెలిస్తే సరే.. లేకుంటే గెలుపు, ఓటములు మామూలేనని తీసుకోవాలి. ఈ ఎన్నికల్లో మనం 90 శాతం విజయం సాధించాం.. ఇక ఎంపిటిసి, జడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికల్లోను మన సత్తా ఏంటో చూపిద్దాం.. అందరూ సైనికులై ముందుకు సాగండి.. టిడిపిని లేకుండా చేయండి అంటూ పిలుపునిచ్చారు రోజా.