స్ట్రీట్ లైట్ ట్రైలర్, లిరికల్ వీడియో సాంగ్ విడుదల
తాన్య దేశాయ్, అంకిత్ రాజ్, కావ్య రెడ్డి, సీనియర్ హీరో వినోద్ కుమార్ ప్రధాన పాత్రల్లో విశ్వ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత శ్రీ మామిడాల శ్రీనివాస్ నిర్మించిన చిత్రం స్ట్రీట్ లైట్. ఈ చిత్రానికి సంబందించిన లిరికల్ వీడియో సాంగ్ తో పాటు టీజర్ విడుదల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అథితులుగా విచ్చేసిన దర్శకుడు జి నాగేశ్వర రెడ్డి లిరికల్ వీడియో సాంగ్ ని విడుదల చేయగా, ట్రైలర్ ని ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ విడుదల చేసారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత దామోదర్ ప్రసాద్, ప్రసన్న కుమార్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, నిర్మాత మోహన్ వడ్లపట్ల తో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.
అనంతరం సి కళ్యాణ్ మాట్లాడుతూ, నిర్మాత శ్రీనివాస్ ఛాంబర్ మనిషిగా, ఎగ్జిబిటర్ గా చాలా మంచి నాలెడ్జ్ ఉంది. ఐతే ఈ సినిమాలో మసాలా ఎక్కువగా ఉంది.. కానీ అది శృతి మించకూడదు అని నా సలహా. ఈ సినిమా చూస్తుంటే చాలా ఫైర్ తో తీసినట్టు అనిపిస్తుంది. ఈ సినిమా విషయంలో నెట్ఫ్లిక్స్ లాంటి వేదికపైకి వెళితే చాలా మంచిది. వాళ్లకు కావలసిన కంటెంట్ ఉంది. ఇక శ్రీనివాస్ గారు యూ ఎఫ్ ఓ, క్యూబ్ లాంటి వాటికి పోటీగా వెళ్లి వాళ్లనే భయపెట్టిన వ్యక్తి. అయన చేసిన పోరాటంతో వాళ్ళు ఆయనను కలుపుకు పోయారు. ఆయనను నిర్మాతలుగా మేము కాపాడలేకపోయాం. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన విశ్వా కూడా రామ్ గోపాల్ వర్మని మించే స్థాయిలో సినిమాలు చేయాలనీ ప్రయత్నం చేసినట్టున్నాడు. తప్పకుండా ఈ సినిమా మంచి విజయం అందుకుని దర్శక నిర్మాతలకు మంచి లాభాలు రావాలని కోరుకుంటున్నాను అన్నారు.
దర్శకుడు జి నాగేశ్వర రెడ్డి మాట్లాడుతూ, శ్రీనివాస్ గారు డిస్ట్రిబ్యూటర్ గా నాకు బాగా తెలుసు. జనరల్ గా చాలా సినిమాలకు రిటర్న్స్ ఎక్కువగా రావు.. కానీ నేను చేసిన తెనాలి రామకృష్ణ సినిమాకు రిటర్న్స్ ఇచ్చిన వ్యక్తి.. అయన నిజాయితీ అక్కడ కనిపించింది. ఈ సినిమాలో కాస్త మసాలా ఎక్కువైంది అని అనిపిస్తుంది. ముక్యంగా సినిమాని తీసిన దర్శకుడు ఇంతకు ముందు భార్య అనే సినిమా చేసాడు.. ఆ సినిమా ఇచ్చిన ప్లాప్ వల్ల వచ్చిన కసితో ఈ సినిమా తీసినట్టు అనిపిస్తుంది. అందుకే మసాలా బాగా దట్టించాడు. ఈ సినిమాకు కాస్త స్టాండర్స్ మైంటైన్ చేసిఉంటే మరో రేంజ్ కి వెళ్ళేది. ఏది ఏమైనా ఓ మంచి ప్రయత్నంతో సినిమా చేస్తున్న శ్రీనివాస్ కు ఈ సినిమా సక్సెస్ అయి బాగా డబ్బులు రావాలని కోరుకుంటున్నాను అన్నారు.
చిత్ర దర్శకుడు విశ్వ మాట్లాడుతూ, ఈ సినిమా జోనర్ గురించి పెద్దలు మాట్లాడారు.. నేను చెబుతున్నాను .. ఇది కచ్చితంగా మెసేజ్ ఇచ్చే సినిమా. ఇందులో కంటెంట్ అలాంటిది కాబట్టి అలా చూపించాం. పగలంతా ఎంతో పెద్దమనుషులుగా చలామణి అయ్యే చాలా మంది రాత్రి అయ్యేసరికి .. క్రిమినల్ థాట్స్, సెక్సువల్ పర్వర్షన్ ఎలా మారతాయి అన్న నేపథ్యంలో ఈ సినిమా తీసాం .. చీకట్లో జరిగే ముక్యంగా స్ట్రీట్ లైట్ కింద జరిగే సంఘటనలతో ఈ సినిమా తెరకెక్కించాం. ఏ విధంగా తమ క్రైమ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ అమాయకుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారో అందులో ఒక యువతికి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవడం 'రివెంజ్ డ్రామా' ను ఆద్యంతం సస్పెన్స్ సడలకుండా తీర్చి దిద్దామ్. అలాగే క్రైమ్, లవ్, రొమాన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఇలా అన్ని ఎమోషన్స్ తో తెరకేక్కించిన మెసెజ్ ఓరియెంటెడ్ సినిమా ఇది అన్నారు.
నిర్మాత మామిడాల శ్రీనివాస్ మాట్లాడుతూ, తెలుగు, హిందీ రెండు భాషల్లో ఈ సినిమాను తీసాం. దర్శకుడు విశ్వ ప్రసాద్ చాలా కష్టపడ్డారు. ఆయనకు కాలు నొప్పి ఉన్నా కూడా నిర్మాత షెడ్యూల్ విషయంలో నష్టపోవద్దు అంటూ రిస్క్ చేసి మరి షూటింగ్ చేసారు. ఇప్పటికే బిజినెస్ పరంగా కూడా చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో మెయిన్ లీడ్ తాన్యా దేశాయ్ అద్భుతంగా చేసింది. అలాగే సీనియర్ వినోద్ కుమార్, చిత్రం శ్రీను, ధన్రాజ్ ఇలా చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు . తప్పకుండా ఈ సినిమాను మంచి సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాను అన్నారు.
హీరోయిన్ తాన్యా దేశాయ్ మాట్లాడుతూ .. మా నిర్మాత కు హ్యాపీ బర్త్ డే.. అలాగే దర్శకుడు విశ్వా గారికి థాంక్స్ చెప్పాలి. ఈ పాత్రకు నన్ను ఎంపికచేసినందుకు. లిరికల్ వీడియో చాలా బాగుంది. తప్పకుండా ఈ సినిమా చూసి అందరు ఆదరిస్తారని కోరుకుంటున్నాను. తప్పకుండా ఈ సినిమా చూసి మమ్మల్ని సపోర్ట్ చేయండి అన్నారు.