శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : మంగళవారం, 6 ఏప్రియల్ 2021 (19:50 IST)

ఎర్ర చీర‌`లో తొలి తొలి ముద్దు సాంగ్ ఆవిష్క‌రించిన‌ మారుతి

Maruthi launch song
డాక్టర్ రాజేంద్రప్రసాద్ ప్రధానపాత్రలో శ్రీ సుమన్ వేంకటాద్రి ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుమన్ బాబు, కారుణ్య చౌదరి జంటగా  శ్రీరామ్, కమల్ కామరాజు కీలక పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ఎర్రచీర. ఇటీవలే తెలంగాణ సినిమాట్రోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విడుదల చేసిన టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమాలోని తొలి తొలి ముద్దు అనే సాంగ్ ని ప్రముఖ దర్శకుడు మారుతీ విడుదల చేసారు.
మారుతీ మాట్లాడుతూ, సుమన్ వేంకటాద్రి ప్రొడక్షన్ బ్యానర్ పై తెరకెక్కిన ఎర్రచీర సినిమాలోని `తొలి తోలి ముద్దు` సాంగ్ ని లాంచ్ చేశాను. ఈ సాంగ్ చాలా బాగుంది. తప్పకుండా ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి సుమన్ గారికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను అన్నారు.
 
సుమన్ బాబు మాట్లాడుతూ, ఈ సాంగ్ సినిమాలో చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ప్రమోద్ పులిగిల్ల సంగీతం అందించగా అంజనా సౌమ్య, హేమచంద్ర ఈ గీతాన్ని ఆలపించారు. ముఖ్యంగా మంచి మ్యూజిక్, లిరిక్స్ కుదిరాయి. అలాగే  లేటెస్ట్ గా విడుదలైన టీజర్తో సినిమా పై భారీ అంచనాలు పెరిగాయి. ఆ అంచనాలను మరింత పెంచేలా ఈ సాంగ్ అలరిస్తుంది. మరి ముఖ్యంగా ఈ సాంగ్ ని అందరు ఉపయోగించుకునేలా అందిస్తున్నాము.. ఎలాంటి కాపీ రైట్ ఉండదు, కాబట్టి అందరు వాడుకునేలా ఉంటుంది. ఇక ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ పాత్ర హైలెట్ గా నిలుస్తుంది. అలాగే ఈ సినిమాకు సంబందించిన అన్ని కార్యక్రమాలు పూర్తి కవొచ్చాయి. త్వరలోనే  చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని అన్నారు.