గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శుక్రవారం, 2 ఏప్రియల్ 2021 (18:07 IST)

స‌త్య‌పై రాసిన 'వాట్ ఏ మ్యాన్.` పాట ఆస‌క్తిరేపుతోంది (video)

Sathya
హాస్య నటుడు సత్య కథానాయకుడిగా నటించిన తొలి సినిమా 'వివాహ భోజనంబు'. అర్జావీ రాజ్ కథానాయిక. నిర్మాణ సంస్థలు ఆనంది ఆర్ట్స్, సోల్జర్స్ ఫ్యాక్టరీ, వెంకటాద్రి టాకీస్ సమర్పణలో కె.ఎస్. శినీష్, సందీప్ కిషన్ నిర్మించిన చిత్రమిది. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించారు. నెల్లూరు ప్రభ అనే ప్రత్యేక పాత్రలో ప్రముఖ యువ హీరో సందీప్ కిషన్ నటించారు. ఈ చిత్రంలోని రెండో పాట 'వాట్ ఏ మ్యాన్'ను శుక్రవారం విడుదల చేశారు.
 
అనిరుద్ విజయ్ (అనివీ) బాణీ అందించిన 'వాట్ ఏ మ్యాన్...'ను సామ్రాట్ రాశారు. హాట్ అండ్ హ్యాపెనింగ్ సింగర్ 'చౌరస్తా' రామ్ పాడారు.
 
"ఒకసారి 2020లోకి వెళ్లి అప్పుడు ఏం జరిగిందో చూసే సమయం వచ్చింది. అదీ నవ్వులతో! హీరో బిల్డప్ సాంగ్ 'వాట్ ఏ మ్యాన్'ను ఈ రోజు విడుదల చేశాం. సినిమాలో తొలి పాట 'ఎబిసిడి...'కి మంచి స్పందన లభించింది. రెండో పాట సైతం ప్రేక్షకులను మెప్పిస్తుంది. త్వరలో సినిమా గురించి మరిన్ని వివరాలు వెల్లడిస్తాం" అని సందీప్ కిషన్ అన్నారు.
 
పాట నేప‌థ్యం ఇదీ!
లాక్‌డౌన్ లో జరిగిన వాస్తవ సంఘటనల ప్రేరణతో రూపొందిన చిత్రమిది. అసలు కథ విషయానికి వస్తే, పది రూపాయలు పార్కింగ్ టికెట్ కొనడానికి, స్నేహితులకు పుట్టినరోజు పార్టీ ఇవ్వడానికి ఇష్టపడని ఓ పిసినారి మహేష్ (సత్య). కరోనా పుణ్యమా అని లాక్‌డౌన్ రావడంతో 30మందితో సింపుల్‌గా పెళ్లి తంతు కానిచ్చేస్తాడు. కానీ, ఆ తరవాత అసలు కథ మొదలవుతుంది. లాక్‌డౌన్ పొడిగించడంతో పిసినారి మహేష్ ఎన్ని కష్టాలు పడ్డాడనేది తెరపై చూడాలని చిత్రబృందం చెబుతోంది. సందీప్ కిషన్ పాత్ర సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందనీ, కథానాయకుడిగా సత్య అద్భుతంగా నటించాడనీ యూనిట్ వర్గాలు తెలిపాయి.
 
ఈ చిత్రంలో నటీనటులు:
సత్య, అర్జావీ రాజ్, సుదర్శన్, శ్రీకాంత్ అయ్యంగార్, సుబ్బరాయ శర్మ, టి.ఎన్.ఆర్, 'వైవా' హర్ష, శివోన్ నారాయణ, మధుమని, నిత్యా శ్రీ, కిరీటి, దయ, కల్పలత & ప్రత్యేక పాత్రలో యువ హీరో సందీప్ కిషన్.
 
సాంకేతిక నిపుణుల వివరాలు:
పీఆర్వో: నాయుడు సురేంద్రకుమార్ - ఫణి కందుకూరి (బియాండ్ మీడియా) & వంశీ - శేఖర్, పాటలు: కిట్టు, కృష్ణ చైతన్య, నృత్యాలు: సతీష్, విజయ్, మాటలు: నందు ఆర్.కె, కథ: భాను భోగవరపు, కళ: బ్రహ్మ కడలి, కూర్పు: చోటా కె. ప్రసాద్, ఛాయాగ్రహణం: మణికందన్, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: సీతారామ్, శివ చెర్రీ, సంగీతం: అనిరుద్ విజయ్ (అనివీ), సమర్పణ: ఆనంది ఆర్ట్స్, సోల్జర్స్ ఫ్యాక్టరీ, వెంకటాద్రి టాకీస్, నిర్మాతలు: కె.ఎస్. శినీష్, సందీప్ కిషన్, దర్శకత్వం: రామ్ అబ్బరాజు.