గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 8 ఏప్రియల్ 2021 (12:44 IST)

తెలుగు రాష్ట్రాల్లో 'వకీల్ సాబ్' ఫీవర్... 3 రోజుల వరకు చూడలేరు!

తెలుగు రాష్ట్రాల్లో 'వకీల్ సాబ్' ఫీవర్ కొనసాగుతోంది. మూడేళ్ళ విరామం తర్వాత పవన్ నటిస్తున్న ఈ చిత్రం ఈ నెల 9వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. దీనికితోడు పవర్‌ స్టార్‌‌కి పోటీగా ఏ సినిమా కూడా లేకపోవడంతో అన్నీ థియేటర్లలోనూ 'వకీల్‌ సాబ్‌' సందడే కనిపిస్తోంది. 
 
అయితే మూడేళ్ల తర్వాత పవన్‌ కల్యాణ్‌‌ని వెండితెరపై చూడబోతున్నామని ఆనందపడుతున్న ఫ్యాన్స్‌ ఎడాపెడా షోలన్నింటిని బుక్‌ చేసేశారు. మూడురోజుల పాటు థియేటర్లన్నీ హౌజ్ ఫుల్లే. ఒక్కటంటే ఒక్క షోకి కూడా టిక్కెట్లు లేవు. 
 
హైదరాబాద్‌లోని హీరో మహేష్‌ బాబుకు చెందిన ఎఎంబీ థియేటర్లో అయితే 27 షోలన్నీ ముందే బుక్కైపోయాయి. దీంతో తొలి రోజే కాదు కనీసం వీకెండ్‌‌లోనైనా "వకీల్‌ సాబ్‌" సినిమా చూద్దామనుకున్న సినీ ప్రేక్షకులకు నిరాశే ఎదురవుతోంది. 
 
ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, పాటలు సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. దీంతో వకీల్‌ సాబ్‌ వసూళ్లలోనూ రికార్డ్‌‌లు సృష్టించడం ఖాయమంటున్నారు. శృతిహాసన్‌ హీరోయిన్‌‌గా నటిస్తోన్న ఈ సినిమాలో నివేదాథామస్‌, అంజలి, అనన్యలు కీలకపాత్రలో నటిస్తున్నారు. 
 
తమన్‌ ఈ సినిమాకి సంగీతం అందించాడు. వేణుశ్రీరామ్‌ ఈసినిమాని తెరకెక్కించగా, బోనీ కపూర్ సమర్పణలో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం విడుదల పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు ఒక పండుగలా వుంది.