బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 8 ఏప్రియల్ 2021 (12:05 IST)

నటి అంజలికి కరోనా పాజిటివ్: షాక్‌లో వకీల్ సాబ్ యూనిట్

వకీల్ సాబ్ యూనిట్‌ను కరోనావైరస్ వెంటాడుతోంది. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్‌లో కీలక పాత్ర పోషించిన నటి అంజలి, కరోనావైరస్ పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. అభిమానులకు మరింత ఇబ్బంది కలిగించే విషయం ఏమిటంటే, ఏప్రిల్ 5న వకీల్ సాబ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో అంజలి పాల్గొన్నారు.
 
ఈ కార్యక్రమానికి మొత్తం తారాగణం, సిబ్బంది హాజరయ్యారు. దీనితో వాళ్లందరూ స్వచ్చందంగా పరీక్షలు చేయించుకోవాల్సి వుంటుంది. ఈ మేరకు అంజలి ఆల్రెడీ రిక్వెస్ట్ చేసింది. మరోవైపు ఇప్పటికే నివేదా థామస్ COVID-19 పాజిటివ్ అని తేలడంతో ఆమె ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు రాలేదు.
 
అయితే ఇప్పుడు అంజలి కరోనా పాజిటివ్ అని తేలడంతో పవర్ స్టార్ అభిమానులు షాక్ తిన్నారు. కోవిడ్ -19 సెకండ్ వేవ్ మొత్తం దేశంలో చాలామంది ప్రముఖులను తాకిందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.