బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : బుధవారం, 7 ఏప్రియల్ 2021 (16:34 IST)

ఇప్పుడు తృప్తి. ఎల్లుండి నుంచి ఎంజాయ్‌మెంట్ః దిల్ రాజు‌

Dil Raju-
`స్టార్ హీరోతో సినిమా చేయాల‌ని నేన‌నుకున్న‌ది పూర్తిచేశాను. ఇప్పుడు తృప్తిగా వుంది. ఆ త‌ర్వాత ఆడియ‌న్స్ సినిమా చూశాక‌ వావ్! అన్న‌ప్పుడు ఎంజాయ్‌మెంట్ మొద‌లవు‌తుంది. అది నేను అనుభ‌వించాల‌నుకుంటున్నా`న‌ని వ‌కీల్‌సాబ్ నిర్మాత దిల్‌రాజు పేర్కొన్నారు. ప‌వ‌న్‌క‌ళ్యాణ్ న‌టించిన ఈ సినిమా ఈనెల‌9న విడుద‌ల‌వుతుంద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఇంకా ఆయ‌న మాట్ల‌లో విందాం.
 
- ప‌న‌వ్‌క‌ళ్యాణ్‌తో 2019డిసెంబ‌ర్‌లో సినిమా మొద‌లుపెట్టాం. మే 21న విడుద‌ల‌చేయాల‌ని అనుకున్నాం. లాక్‌డౌన్‌ రావ‌డంతో మొత్తం మారిపోయింది. ఏడాదిపాటు దాన్ని అలా ప‌ట్ట‌కుని విడుద‌ల‌కు తీసుకువ‌చ్చాం.
 
- క‌ళ్యాణ్‌గారిని ఈరోజుకూడా క‌లిశాను. మా జ‌ర్నీ చాలా ఇంపార్టెంట్‌. ఒక్క సినిమాతో ఆగిపోకుండా మ‌ళ్ళీ సినిమాలు చేసే స్థాయికి చేరుకున్నాం.
- నా గురించి వేరే వాళ్ళు చెప్ప‌డం వేరు. కానీ సినిమా చేస్తుండ‌గా నా జ‌ర్నీని క‌ళ్యాణ్ చూడ‌డం వేరు. అందుకే నా గురించి బాగా తెలిసి మ‌నం మ‌ళ్ళీ సినిమాలు చేద్దామ‌ని ఆయ‌న అన్నారు. 
 
- స్టార్ హీరో ఎవ‌రైనా నాతో మ‌ర‌లా సినిమాలు చేయాల‌నుకోవడానికి కార‌ణం ఒక్క‌టే. ఓ స్టార్ హీరో అయినా సినిమా చేసేట‌ప్పుడు షూటింగ్ ప్రాసెస్ కావ‌చ్చు. ప్ర‌మోష‌న్‌, రిలీజ్‌కు ప్రోప‌ర్‌గా ఎలా చేస్తున్నాడ‌నేది కావ‌చ్చు. ఇవ‌న్నీ లెక్క‌లు చూస్తారు. షూటింగ్‌లో స‌మ‌స్య‌లు వ‌స్తాయి. అవ‌న్నీ వారికి తెలిసి ఒత్తిడి గురికాకుండా చూసుకోవాలి. అది నిర్మాత‌గా నా బాధ్య‌త‌. 
 
- వేణు శ్రీ‌రామ్‌ను ఈ సినిమాకు ద‌ర్శ‌కుడి అని మొద‌ట అనుకోలేదు. ఆయ‌నకు `ఐకాన్‌` అని అల్లు అర్జున్‌తో సినిమా అనుకున్నాం. కానీ క‌రోనా టైంలో కొన్ని ప‌రిస్థితుల వ‌ల్ల పింక్ సినిమా గురించి ఆయ‌న‌కు చెప్ప‌డం జ‌రిగింది. వెంట‌నే మూడు వ‌ర్స‌న్‌లు వేణు రాసుకుని ఇలా ఈ సీన్‌చేస్తే బాగుంటుంద‌ని రాసుకుని వ‌చ్చాడు. ఒక అభిమానిగా ఆయ‌న హీరోను ఎలా చూడాల‌నుకుంటున్నాడో అది చూపించాడు. అది న‌చ్చి వెంట‌నే త్రివిక్ర‌మ్‌తో క‌లిసి క‌ళ్యాణ్ ద‌గ్గ‌ర‌కు వెళ్ళాం. ఆయ‌న‌కూ న‌చ్చి ఓకే అన్నారు. .