గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 6 ఏప్రియల్ 2021 (18:06 IST)

పగలు ఓ పార్టీతో రాత్రి మరో పార్టీతో పవన్ కళ్యాణ్: సజ్జల

పవన్ కళ్యాణ్‌కు ఆవేశం తప్ప ఆలోచనే లేదని వైసిపి ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఆయన పగలు ఓ పార్టీతో రాత్రి మరో పార్టీతో తిరుగుతుంటారని అన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఎదుర్కోలేక జనసేన-భాజపాలు లోపాయికారి ఒప్పందం చేసుకున్నాయనీ, తెరవెనుక రాజకీయాలు నడుపుతున్నాయంటూ విమర్శించారు.
 
తిరుపతి ఉప ఎన్నికలో వైసిపి భారీ మెజారిటీతో విజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తూ జనరంజకమైన పాలనను సీఎం జగన్ అందిస్తున్నారనీ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినప్పటికీ సంక్షేమ పథకాలన్నింటినీ సజావుగా అమలు చేస్తున్న ఘనత సీఎం జగన్ మోహన్ రెడ్డిది అన్నారు.