గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఐవీఆర్
Last Updated : బుధవారం, 7 ఏప్రియల్ 2021 (22:48 IST)

Vakeel Saab, పవన్ పారితోషికం నిమిషానికి కోటి రూపాయలు?

వకీల్ సాబ్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 9న విడుదల కాబోతోంది. పవన్ కళ్యాణ్ అభిమానులైతే పండగ చేసుకుంటున్నారు. ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వందలు కాదు.. వేలల్లో టిక్కెట్లను కొనేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది.
 
ఇదిలావుంటే పవన్ మాయాజాలం ఏంటో మరోసారి రుజువు కాబోతోందంటూ మెగా ప్రొడ్యూసర్ దిల్ రాజు అన్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఇన్నేళ్ల తర్వాత చిత్రాన్ని తీయడం మర్చిపోలేనిదన్న ఆయన చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అన్నారు.
 
కాగా పవన్ కళ్యాణ్ పారితోషికం గురించి ఓ వార్త హల్చల్ చేస్తోంది. వకీల్ సాబ్ చిత్రంలో పవన్ కళ్యాణ్ కనిపించేది మొత్తం 50 నిమిషాలట. ఈ 50 నిమిషాలకు పవన్ రూ. 50 కోట్లు పారితోషికం తీసుకున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజమెంతో తెలియదు కానీ.. ఇదే నిజమైతే నిమిషానికి పవన్ కోటి రూపాయలు తీసుకున్నట్లన్నమాట.