1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Sundeep Kishan's 'Sigma' first single crosses 5 million+ views.

Sundeep Kishan: 5 మిలియన్+ వ్యూస్ క్రాస్ చేసిన సందీప్ కిషన్.. సిగ్మా ఫస్ట్ సింగిల్

Sundeep Kishan
Sundeep Kishan
లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ నిర్మిస్తున్న చిత్రం ‘సిగ్మా’. సందీప్ కిషన్ హీరోగా, ఫారియా అబ్దుల్లా కథానాయికగా కనిపించనున్నారు. అలాగే రాజు సుందరం, సంపత్ రాజ్, శివ్ పండిట్, అంబు తాసన్, యోగ్ జాపీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. జాసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న  జూలై 31న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతోంది.
 
 
తాజాగా విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘సిగ్మా స్టైల్’ సాంగ్ అతి తక్కువ సమయంలోనే 5 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి సంగీత ప్రియులు, యువత నుంచి విశేష ఆదరణ పొందుతోంది. ఈ పాట తెలుగు, తమిళ ప్రేక్షకులను సమానంగా ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.
 
ఎనర్జీతో నిండిన బీట్, స్టైలిష్ విజువల్స్, గ్రాండ్ ప్రెజెంటేషన్‌తో ‘సిగ్మా స్టైల్’ పాట ప్రేక్షకులను వెంటనే ఆకట్టుకుంది. సందీప్ కిషన్ మాస్ స్క్రీన్ ప్రెజెన్స్ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలవగా, ఫారియా అబ్దుల్లా తన గ్రేస్‌ఫుల్ క్లాసికల్-వెస్ట్రన్ ఫ్యూజన్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌తో పాటను మరో స్థాయికి తీసుకెళ్లింది.   దర్శకుడు జాసన్ సంజయ్ స్టైలిష్ ఆన్‌స్క్రీన్ అప్పియరెన్స్ కూడా అలరించింది. క్యాచీ ట్యూన్, స్టైలిష్ ట్రీట్‌మెంట్, ఎనర్జిటిక్ ప్రెజెంటేషన్‌తో ఈ పాట యువతకు ఫేవరెట్‌గా మారింది.
 
ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తుండగా, కృష్ణన్ వసంత్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రవీణ్ కేఎల్ ఎడిటర్‌గా, హరిహరసుతన్ విజువల్ ఎఫెక్ట్స్ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నారు. ఈ చిత్ర ఆడియో హక్కులను సరేగమా సొంతం చేసుకుంది. త్వరలోనే ఆడియో లాంచ్, ట్రైలర్ లాంచ్‌కు సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన అప్‌డేట్స్‌ను మేకర్స్ ప్రకటించనున్నారు.
About Writer
దేవీ
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
Vimal Krishna: ప్రేయసిని కూడా అనుమానించే అనుమాన పక్షి గా విమల్ కృష్ణ