సంబంధిత వార్తలు
- Faria Abdulla: సత్య’నుంచి ‘పెళ్లి చూపులు వరకు ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం : ఫరియా
- ఇందులో ప్రభాస్, మహేష్ బాబు, సిద్ధార్థ, యష్, అర్జున్ రెడ్డిని కూడా వున్నారు : దిల్ రాజు
- ప్రేమకి పులిహోర కలిపుకుంటున్న తరుణ్ భాస్కర్, మానస చౌదరి
- JD Chakravarthy: నచ్చకపోతే థియేటర్స్‌లోనే కాదు, ఓటీటీలో కూడా చూడరు : జేడీ చక్రవర్తి
- Vishwak Sen: థాయ్‌లాండ్‌లో విశ్వక్ సేన్, తరుణ్ భాస్కర్ ల ఈఎన్ఈ రిపీట్ షెడ్యూల్
JDChakravarthi: ఎన్నో గాయాలను తట్టుకుని విడుదలకు సిద్ధమైన గాయపడ్డ సింహం
Nara Rohit, Kashyap Srinivas, Faria Abdullah, Manasa Choudhary, JD Chakravarthy
నారా రోహిత్ మాట్లాడుతూ, అందరికీ చాలా పెద్ద సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. ఇక్కడికి రావడానికి కారణం విజయ్, పవన్ — వాళ్లిద్దరి కోసం వచ్చాను. విజయ్‌తో నాకు చాలా కాలంగా అసోసియేషన్ ఉంది. అలాగే పవన్‌తో కూడా నేను నెక్స్ట్ సినిమా ఇదే బ్యానర్‌లో చేస్తున్నాను. కళ్యాణ్ గారు, భాను గారు, విజయ్ గారికి ఈ సినిమా ఒక మెమొరబుల్ ఫిల్మ్ అవ్వాలని కోరుకుంటున్నాను. మే 1న అందరూ ఈ సినిమాను థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయండి. పైరసీని ఎంకరేజ్ చేయకండి. థాంక్యూ సో మచ్.”
హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ, . చిన్నప్పటి నుంచి జేడీ గారి సినిమాలు చూస్తూ పెరిగాం. ఆయన ఇంకా మరిన్ని సినిమాలు చేసి మమ్మల్ని ఇన్‌స్పైర్ చేయాలి. ఈ సినిమాలో నేను చేయడానికి ఒక కారణం నారా రోహిత్ గారు కూడా. ఆయన నా సినిమాల్లో చాలాసార్లు క్యామియో చేశారు.. పవన్ సాదినేని డైరెక్ట్ చేస్తున్నప్పుడు మొదటి హీరోగా నేనే చేశాను. ఇప్పుడు ఆయన ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు కూడా నేను చేయడం ఆనందంగా ఉంది. విజయ్, భాను, కళ్యాణ్ — వీరంతా నా క్లోజ్ ఫ్రెండ్స్. వాళ్ల కోసం నా వంతు కాంట్రిబ్యూషన్‌గా ఈ సినిమా చేశాను. ఈ ఈవెంట్‌కు వచ్చిన దర్శకులందరికీ థాంక్యూ.
జేడీ చక్రవర్తి మాట్లాడుతూ, ఈ సినిమాకు ఫస్ట్ హీరో పవన్ సాదినేని. ఆయన ఈ సినిమా చేయాలనుకున్నప్పుడు ప్రొడ్యూసర్లు లేరు. నాకు, తరుణ్‌కి చెప్పిన తర్వాత సినిమా స్టార్ట్ చేశాడు. మధ్యలో కొన్ని సమస్యలు వచ్చినా, కశ్యప్ వెనుక నిలబడ్డాడు . ఈ సినిమాలో తరుణ్ భాస్కర్ చేసిన క్యారెక్టర్, ట్రంప్‌తో పెట్టుకున్న గొడవ వల్ల నా క్యారెక్టర్ ఇన్వాల్వ్ అవుతుంది. నాకు తెలియకుండా శ్రీ విష్ణు క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. ఈ సినిమాకి ఒక సమస్య వచ్చింది. ఈ సినిమాలో ట్రంప్ కార్డ్ ఉంది. కశ్యప్ ఇండియా–అమెరికాకు వార్ తీసుకురాగలిగాడు.. శ్రీ విష్ణు అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో కనిపిస్తారు. మీరు హాయిగా నవ్వుకోవాలంటే మే 1న గాయపడ్డ సింహం తప్పకుండా చూడండి.
డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్ మాట్లాడుతూ, మా నిర్మాతలు సినిమా మీద ప్యాషన్ ఉన్న వారు. వాళ్లకు డబ్బులు వస్తే, నా లాంటి వాళ్లకు లైఫ్ వస్తుంది. స్వీకర్ అగస్తి తన బెస్ట్ మ్యూజిక్ ఇచ్చి సినిమాను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాడు. జేడీ గారు, తరుణ్ ఇచ్చిన సపోర్ట్‌ను ఎప్పటికీ మర్చిపోలేను. ఈ సినిమా నాకు మంచి ఫ్రెండ్స్‌ను ఇచ్చింది. ఇందులో ట్రంప్ ఎలిమెంట్‌ను వినియోగించాం. శ్రీ విష్ణు గారి ఇంపాక్ట్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఆయన ఈ సినిమాలో భాగం కావడం మా అదృష్టంగా భావిస్తున్నాను.
