గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 14 జూన్ 2023 (12:39 IST)

బాలీవుడ్ నటుడుతో మిల్కీ బ్యూటీ ప్రేమాయణం

Tamannah Bhatia
హైదరాబాద్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్న మాట నిజమేనని మిల్కీ బ్యూటీ తమన్నా అన్నారు. అతను తన పట్ల చాలా కేరింగ్‌గా ఉంటారని చెప్పారు. చాలా మంది అమ్మయిలు తమను అర్థం చేసుకునే భర్త వస్తే బాగుంటుందని భావిస్తారు. నేను కూడా అలాగే అనుకున్నాను. అలాగే, విజయ్ నా ప్రపంచాన్ని అర్థం చేసుకున్నాడు. 
 
అంతేకాకుమడా నా గురించి ఎల్లవేళలా కేరింగ్ తీసుకునే వ్యక్తిగా ఉన్నాడు. అతడి ప్రేమ పట్ల నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. ఏదో ఒక రోజు ఇద్దరి ప్రపంచం ఒక్కటే అవుతుంది. ఇద్దరి మధ్య ఉన్న సంబంధం చాలా ముఖ్యమైనదిగా భావిస్తున్నాను అని తమన్నా వెల్లడించింది.