మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 14 జూన్ 2023 (10:45 IST)

మహిళలను గౌరవించే వ్యక్తినే పెళ్లి చేసుకుంటాను.. అంజలి

Anjali look
తెలుగు, మలయాళం, కన్నడ భాషా చిత్రాలలో నటించిన అంజలి ప్రస్తుతం గ్లామర్ పెంచేసింది. దీంతో ఆమెకు అవకాశాలు వెల్లువల్లా వస్తున్నాయి. తాజాగా ఓ వెబ్ సిరీస్‌లో గ్లామర్‌ పంట పండించింది. తాజాగా అంజలి తన పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మహిళలను ఎలా గౌరవించాలో తెలిసిన వారిని తాను పెళ్లి చేసుకుంటానని వెల్లడించింది.
 
పెళ్లయిన తర్వాత కూడా తనను గౌరవంగా చూసే వ్యక్తి అయి ఉండాలి. తర్వాతే ప్రేమ.. రొమాన్స్  ఏదైనా అంటూ కామెంట్స్ చేసింది.
 
ఇకపోతే.. అంజలి పెళ్లికి అంగీకరించినట్లు తెలుస్తోంది. పెద్దల కుదిర్చిన వివాహానికి ఆమె ఓకే చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం శంకర్-రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రంలో అంజలి నటిస్తోంది. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటి కియారా అద్వానీ, సముద్రఖని, ఎస్.జె. సూర్య, నవీన్ చంద్ర, మేకా శ్రీకాంత్, జయరామ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.