బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 27 మార్చి 2023 (13:19 IST)

రామ్‌చ‌ర‌ణ్‌, డైరెక్ట‌ర్ శంక‌ర్ పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజ‌ర్‌

Game changer
Game changer
గ్లోబ‌ల్‌ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియా చిత్రం RC15కి `గేమ్ చేంజ‌ర్‌` అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. ఎన్నో సూప‌ర్ డూప‌ర్ బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌ను రూపొందించిన ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ ఈ మూవీని నిర్మిస్తోంది. భారీ బ‌డ్జెట్‌తో నిర్మాత‌లు దిల్ రాజు, శిరీష్ అన్ కాంప్ర‌మైజ్డ్‌గా అంచ‌నాల‌కు ధీటుగా గేమ్ చేంజ‌ర్‌ను నిర్మిస్తున్నారు.
 
Game changer poster
Game changer poster
రామ్ చ‌ర‌ణ్ పుట్టిన‌రోజు (మార్చి 27) సంద‌ర్భ‌గా గేమ్ చేంజ‌ర్ టైటిల్ రివీల్ వీడియోను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ణ్ పాన్ ఇండియా ఇమేజ్‌కు త‌గ్గ టైటిల్‌ను స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ఖ‌రారు చేశారు. టైటిల్ రివీల్ అయిన స‌ద‌రు వీడియో చూస్తే హీరో క్యారెక్ట‌రైజేష‌న్ లార్జ‌ర్ దేన్ లైఫ్‌గా ట్రాన్స్‌ఫ‌ర్‌మేటివ్‌గా ఉంద‌ని తెలుస్తోంది. ఈరోజునే రామ్ చ‌ర‌ణ్ ఫ‌స్ట్ లుక్‌ను కూడా విడుద‌ల చేస్తున్నారు మేక‌ర్స్‌.
 
న‌టీ న‌టులు: రామ్ చ‌ర‌ణ్‌, కియారా అద్వానీ, అంజ‌లి, సముద్ర‌ఖ‌ని, ఎస్‌.జె.సూర్య‌, శ్రీకాంత్‌, సునీల్‌, న‌వీన్ చంద్ర త‌దిత‌రులు
సాంకేతిక వ‌ర్గం: ద‌ర్శ‌క‌త్వం:  శంక‌ర్,  నిర్మాత‌లు:  దిల్ రాజు, శిరీష్‌,  రైట‌ర్స్‌:  ఎస్‌.యు.వెంక‌టేశ‌న్‌, ఫ‌ర్హ‌ద్ సామ్‌జీ, వివేక్‌
స్టోరీ లైన్‌:  కార్తీక్ సుబ్బ‌రాజ్‌,  కో ప్రొడ్యూస‌ర్‌:  హ‌ర్షిత్‌
సినిమాటోగ్ర‌ఫీ:  ఎస్‌.తిరుణావుక్క‌ర‌సు
మ్యూజిక్‌:  త‌మ‌న్.ఎస్‌
డైలాగ్స్‌:  సాయిమాధ‌వ్ బుర్రా
లైన్ ప్రొడ్యూస‌ర్స్‌:  ఎస్‌.కె.జ‌బీర్‌, న‌ర‌సింహారావ్‌.ఎన్‌
ఆర్ట్ డైరెక్ట‌ర్‌:  అవినాష్ కొల్ల‌
 యాక్ష‌న్ కొరియోగ్రాఫ‌ర్‌:  అన్బ‌రివు
డాన్స్ కొరియోగ్రాఫ‌ర్స్‌:  ప్ర‌భుదేవా, గ‌ణేష్ ఆచార్య‌, ప్రేమ్ ర‌క్షిత్‌, బాస్క‌క్ష మార్టియా, జానీ, శాండీ
లిరిసిస్ట్‌:  రామ‌జోగ‌య్య శాస్త్రి, అనంత శ్రీరామ్‌, కాస‌ర్ల శ్యామ్‌
ఎడిట‌ర్‌:  షామీర్ ముహ్మ‌ద్
సౌండ్ డిజ‌న‌ర్‌:  టి.ఉద‌య్‌కుమార్‌