ఢిల్లీ లో బిజీబిజీగా రామ్‌చరణ్ రాత్రికి హైదరాబాద్
ఆర్.ఆర్.ఆర్. సినిమా ఆస్కార్ వేడుకల సంబరం ముగిసింది. శుక్రవారంనాడు ఢిల్లీ చేరిన రామ్‌చరణ్‌కు అడుగడుగునా అభిమానులు నీరాజనాలు పలికారు. సెల్ఫీలు తీసుకోవడానికి ఎగబడ్డారు. ఢిల్లీలో ఇండియా టుడే ఆధ్వర్యంలో ఆయన ఓ ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన రామ్‌చరణ్ చిన్నతనంనుంచి గ్లోబర్ స్టార్ అయ్యే క్రమాన్ని ఓ వీడియో రూపంలో పొందుపరిచింది ఇండియా టుడే.
ఇక ఈరోజు సాయంత్రం అక్కడి కార్యక్రమాలు ముగించుకుని రాత్రి 9గంటలకు హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్నట్లు ఆల్ ఇండియా చిరంజీవి యువత ప్రకటనలో పేర్కొంది. ఇదేరోజు ఎన్.టి.ఆర్. హైదరాబాద్ చేరుకున్నారు. ఆయన ఈరోజు రాత్రి శిల్పకళావేదికలో దాస్‌కా దమ్కీ ప్రీరిలీజ్ వేడుకలో పాల్గొంటున్నారు.