శనివారం, 2 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 17 మార్చి 2023 (12:20 IST)

ప్రధానితో ఏపీ సీఎం జగన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ

modi - jagan
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఏపీ సీఎం జగన్ భేటీ అయ్యారు. సీఎం జగన్‌ గురువారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. పలువురు కేంద్రమంత్రులతో కూడా సమావేశం కానున్నారు. సీఎం జగన్‌ గురువారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. సీఎం జగన్ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధానితో చర్చించారు. 
 
ప్రధాని, ఏపీ సీఎంల సమావేశం అరగంటకుపైగా సాగింది. విభజన హామీలు, సమస్యలు, పెండింగ్ నిధులపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం 2.30 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సీఎం జగన్ భేటీ అవుతారని సమాచారం. అనంతరం పలువురు కేంద్రమంత్రులతో కూడా సీఎం జగన్‌ భేటీ అయ్యాక తిరిగి విజయవాడకు బయల్దేరనున్నారు.