శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 15 మార్చి 2023 (11:21 IST)

కోడికత్తి కేసులో బాధితుడు జగన్ హాజరుకావాల్సిందే : ఎన్.ఐ.ఏ కోర్టు

nia court
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డిపై విశాఖపట్టణం విమానాశ్రయంలో ఓ వ్యక్తి కోడికత్తితో దాడి చేసిన విషయం తెల్సిందే. ఈ కేసు విచారణను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్.ఐ.ఏ) చేపట్టగా, కేసు విచారణ కూడా ఎన్.ఐ.ఏ కోర్టులో సాగుతోంది. ఈ క్రమంలో ఈ కేసుకు సంబంధించి విజయవాడ కోర్టులో ఎన్.ఐ.ఏ విచారణ జరిగింది. ఈ సందర్భంగా న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీచేసింది. వచ్చే నెల పదో తేదీన విచారణకు రావాలని బాధితుడు జగన్మోహన్ రెడ్డిని కోర్టు ఆదేశించింది. సీఎంతో పాటు ఆయన పీఏ నాగేశ్వర రెడ్డి కూడా విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. 
 
మరోవైరపు, మంగళవారం ఇదే కేసులో విశాఖ ఎయిర్‌పోర్టు అథారిటీ కమాండర్ దినేశ్‌ను కోర్టు విచారించింది. ఈ సందర్భంగా పోలీసులు కోడికత్తిని, మరో చిన్న కత్తిని కోర్టుకు అప్పగించారు. అలాగే, ఈ కేసుకు సంబంధించిన ఓ సెల్‌ఫోన్, పర్సును కూడా ఎన్ఐఏ ధర్మాసనానికి అందించారు. అనంతరం, తదుపరి విచారణను కోర్టు ఏప్రిల్ 10వ తేదీకి వాయిదా వేసింది. ఆ రోజున బాధితుడైన సీఎం జగన్ తప్పుకుండా కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది.