జ్ఞాన్‌వాపి కేసులో కీలక ఆదేశాలు జారీచేసిన సుప్రీంకోర్టు
జ్ఞాన్‌వాపి మసీదు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వీడియోగ్రఫీ సర్వే నివేదికపై ముఖ్యమైన ఆదేశాలను వారణాసి కోర్టు జారీచేసింది. జ్ఞాన్‌వాపి మసీదు వీడియోగ్రఫీ సర్వే రిపోర్టును పిటిషనర్లకు అందజేయాలని కోర్టు ఆదేశించింది. దీంతో 27 మంది పిటిషనర్లకు నివేదిక అందచేయనుంది. అయితే, ఆ నివేదికను ఎట్టిపరిస్థితుల్లోనూ బహిర్గతం చేయొద్దంటూ పిటిషనర్లకు కోర్టు స్పష్టం చేసింది.
ఇదిలావుంటే, సర్వే నివేదికను బహిర్గతం చేయాలని హిందూ సంఘాల తరపు న్యాయవాది కోర్టును ఆశ్రయించారు. అలాగే, జ్ఞాన్‌వాపి మసీదులో లభించిన శివలింగానికి పూజలు చేసేందుకు అనుమతించాలని ఆయన కోరారు. జ్ఞాన్‌వాపీ మసీదు వీడియో సర్వేను బహిర్గతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇరు వర్గాల వాదనలు ఆలకించిన కోర్టు తదుపరి విచారణను జూలై 4వ తేదీకి వాయిదా వేసింది.