1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. AP Assembly 2022 Adjourned Sine Die

2022-2023 బడ్జెట్‌కు ఏపీ సర్కారు ఆమోదం

AP
2022-2023 వార్షిక బడ్జెట్‌కు ఏపీ ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ఆర్థిక మంత్రి బుగ్గన ప్రవేశపెట్టిన బడ్జెట్‌కు ఆమోదం తెలిపినట్లు ఏపీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం ప్రకటించారు.

ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ఈ సంవత్సరం రూ. 2.56 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టామని తెలిపారు.ఇది ప్రజా బడ్జెట్‌అని అన్నారు. గత మూడేళ్లుగా ప్రభుత్వ ఆచరణే మాట్లాడుతుందన్నారు.
 
మూడేళ్లలో 95 శాతం హామీలు నెరవేర్చామని జగన్ పేర్కొన్నారు. కరోనా వచ్చి ఆదాయం తగ్గినా ప్రభుత్వ దీక్ష మారలేదని అన్నారు. లబ్ధిదారుల ఎంపికలో కులమత ప్రాంతాలు, రాజకీయాలు చూడలేదని పేర్కొన్నారు. వచ్చే ఏప్రిల్‌ నుంచి 2023 మార్చి నెలవరకు నెలవారీగా సంక్షేమ కార్యక్రమాల అమలును ప్రకటించారు. చంద్రబాబు తన ఐదేళ్లకాలంలో చెప్పుకోడానికి ఒక్క మంచిపని చేయలేదని విమర్శించారు.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
తోటి ఉపాధ్యాయురాలిపై కీచక టీచర్ అత్యాచారం.. కారులో ఎక్కించుకుని?