గురువారం, 29 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 17 మార్చి 2023 (12:51 IST)

కూల్ డ్రింక్స్‌లో మత్తుమందు..13మంది అత్యాచారం చేసిన ఎన్నారై..

woman
మహిళలపై అకృత్యాలు ఆగట్లేదు. తాజాగా ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసం చేసి.. 13మందిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ ఎన్నారై. వివరాల్లోకి వెళితే.. ఉద్యోగం ఇప్పిస్తామంటూ ఇంటర్వ్యూలకు పిలిపించి.. మత్తు కలిపిన డ్రింక్స్ తాగించి వారిపై అత్యాచారానికి పాల్పడేవాడు. 
 
ఈ అకృత్యాలను వీడియో తీసి బెదిరించేవాడు. అతడు ఆస్ట్రేలియాలోని సిడ్నీకి చెందిన భారత సంతతి వ్యక్తి బాలేశ్ ధన్‌కర్. ఇతడికి కొరియా మహిళంటే పిచ్చి. ఇతడిచే బాధితులైన వారు ఎక్కువ కొరియా మహిళలే. 
 
2018 నుంచి ఇతడు ఇలా 13 మంది మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 2018 అక్టోబరులో పోలీసులు ఇతడి సొంత ఫ్లాటులో జరిగిన సోదాల్లో మత్తు పదార్థాలు కలిపిన డ్రింక్స్, బాటిల్స్, వీడియోలతో పాటు 47 వీడియోలతో కూడిన హార్డ్ డ్రైవ్ దొరికింది. ఇక బాలేశ్ నేరాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.