శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 17 మార్చి 2023 (12:18 IST)

మాస్టారూ మాస్టారూ.. ఓటీటీలో వచ్చేసిన "సార్''

Dhanush, Samyukta Menon
టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన కోలీవుడ్ స్టార్ నటుడు ధనుష్ తాజా సినిమా సార్ శుక్రవారం నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ అరంగేట్రం చేసింది. ఈ సోషియో డ్రామాలో భీమ్లా నాయక్ ఫేమ్ సంయుక్త కథానాయికగా నటించారు. 
 
తాజాగా ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ, ఆంగ్ల ఉపశీర్షికలతో ప్రసారం చేయడానికి సార్ సినిమా ఓటీటీలో అందుబాటులో ఉంది.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమా బ్యానర్‌పై నిర్మించిన ఈ చిత్రంలో సముద్రఖని, సాయి కుమార్, తనికెళ్ల భరణి, హైపర్ ఆది, నర్రా శ్రీనివాస్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ స్వరాలు సమకూర్చారు.