శుక్రవారం, 4 అక్టోబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 25 మార్చి 2023 (17:17 IST)

సైబర్ క్రైమ్ బాధితురాలిగా మారిన ఐశ్వర్య రాజేష్

Aishwarya Rajesh
ప్రముఖ నటి ఐశ్వర్య రాజేష్ కూడా సైబర్ క్రైమ్ బాధితురాలిగా మారింది. ఐశ్వర్య రాజేష్ మేనేజర్ ఆమె ట్విట్టర్ ఖాతా హ్యాక్ చేయబడిందని అధికారికంగా ధృవీకరించారు. 
 
నటి ఐశ్వర్య రాజేష్ ట్విట్టర్ ఖాతా హ్యాక్ చేయబడింది. కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇది త్వరలో పరిష్కరించబడుతుంది. అప్పటివరకు, అభిమానులు, అనుచరులు ఆమె ఖాతా నుండి చేసిన ఏవైనా ట్వీట్లు వచ్చాయంటే పట్టించుకోవద్దని అభ్యర్థించారు. 
 
ఐశ్వర్య రాజేష్ మరో ట్వీట్ కూడా నమోదైంది. ఈ ట్వీట్‌ ద్వారా ఎలెన్ మస్క్‌ను ట్యాగ్ చేశారు. ఇందులో నటి తరుపున ఆమె ట్విట్టర్ ఖాతాను రికవరీ చేయాలని డిమాండ్ చేశారు.