శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 18 జనవరి 2023 (21:33 IST)

బొల్లి వ్యాధి బారిన పడిన మమతా మోహన్ దాస్

mamata mohandoss
టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత మయోసైటిస్ వ్యాధిచే ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా నటి మమతా మోహన్ దాస్ బొల్లి వ్యాధి బారిన పడింది. మమతా మోహన్ దాస్ తాను విటిలిగో వ్యాధి బారిన పడినట్టు ప్రకటించారు. ఇదొ ఆటో ఇమ్యూన్ డిజార్డర్. 
 
అంటే మనల్ని రక్షించాల్సిన రోగ నిరోధక వ్యవస్థ మనపైనే దాడి చేయడం మొదలు పెడితే వచ్చే ఎన్నో రకాల వ్యాధుల్లో విటిలిగో కూడా ఒకటి. చర్మంపై కనిపిస్తుంది.  
 
వ్యాధి నిరోధక శక్తిలో భాగమైన యాంటీబాడీలు ఈ మెలనోసైట్స్ కణాలపై దాడి చేసి నాశనం చేయడం వల్ల బొల్లి వ్యాధి ఏర్పడుతుంది. దీనివల్ల చర్మం సహజ రంగును కోల్పోయి తెల్లగా కనిపిస్తుంది. ఎన్టీఆర్ యమదొంగ , నాగార్జున కింగ్ వంటి సినిమాలలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో మమతా మోహన్ దాస్ కనిపించింది.