ఆదివారం, 1 అక్టోబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 17 జనవరి 2023 (12:33 IST)

ఐదు భాషల్లో విడుదలకు సిద్ధమైన "శాకుంతలం"

shakuntalam
హీరోయిన్ సమంత ప్రధాన పాత్రధారిలో నటించిన చిత్రం "శాకుంతలం". ఐదు భాషల్లో విడుదలకానున్న ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్‌ను ఈ నెల 18వ తేదీన విడుదల చేయనున్నారు. అలాగే, వచ్చే నెల 17వ తేదీన విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ మూవీలో దుష్యంతుడిగా దేవ్ మోహన్ నటించారు. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం దృశ్యకావ్యంగా మలచిన ఈ సినిమాకి మణిశర్మ సంగీతారాన్ని సమకూర్చారు.
 
ఈ సినిమా నుంచి తొలి సింగిల్‌ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నెల 18వ తేదీన "మల్లిక.." అంటూ సాగే ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటిస్తూ, కొంతసేపటికి క్రితం అధికారిక పోస్టర్‌ను రిలీజ్ చేశారు. 
 
తెలుగుతో పాటు ఇతర భాషల్లో ఫస్ట్ సింగిల్‌ను వదలనున్నారు. 'శకుంతల' పాత్రను సమంత పోషించగా, దుష్యంతుడి పాత్రలో మలయాళ నటుడు దేవ్ మోహన్ పరిచయం కానున్నారు. మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, అనన్య నాగళ్ళ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు.