1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 16 మే 2023 (19:08 IST)

గేమ్ చేంజ‌ర్‌ రిలీజ్ డేట్ హ్యాపీ గా ప్రకటించిన రామ్ చ‌ర‌ణ్

Ramcharan
Ramcharan
గ్లోబ‌ల్‌ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియా చిత్రం `గేమ్ చేంజ‌ర్‌`.  ఈ సినిమా విడుదల తేదీ  పట్ల రామ్ చ‌ర‌ణ్ హ్యాపీ గా  ఉన్నట్లు పోస్ట్ చేసాడు. గేమ్ చేంజ‌ర్‌ రిలీజ్ డేట్ 18. 12. 2023ల రాబోతుంది. అందుకు చాలా హ్యాపీగా మీతో షేర్ చేసుకుంటున్నానని చరణ్ అన్నారు. 
 
ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ ఈ మూవీని నిర్మిస్తోంది. భారీ బ‌డ్జెట్‌తో నిర్మాత‌లు దిల్ రాజు, శిరీష్ అన్ కాంప్ర‌మైజ్డ్‌గా అంచ‌నాల‌కు ధీటుగా గేమ్ చేంజ‌ర్‌ను నిర్మిస్తున్నారు.
 
న‌టీ న‌టులు: రామ్ చ‌ర‌ణ్‌, కియారా అద్వానీ, అంజ‌లి, సముద్ర‌ఖ‌ని, ఎస్‌.జె.సూర్య‌, శ్రీకాంత్‌, సునీల్‌, న‌వీన్ చంద్ర త‌దిత‌రులు
సాంకేతిక వ‌ర్గం: ద‌ర్శ‌క‌త్వం:  శంక‌ర్,  నిర్మాత‌లు:  దిల్ రాజు, శిరీష్‌,  రైట‌ర్స్‌:  ఎస్‌.యు.వెంక‌టేశ‌న్‌, ఫ‌ర్హ‌ద్ సామ్‌జీ, వివేక్‌