సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 8 మే 2023 (12:28 IST)

ఐపీఎల్ తరహాలో ఏపీఎల్.. ఆ జట్టుపై కన్నేసిన రామ్ చరణ్?!

Ram Charan,  Upasanakonidela
ఇండియన్ ప్రీమియర్ లీగ్ తరహాలో వివిధ రాష్ట్రాలు పొట్టి ఓవర్ల లీగ్ పోటీలు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తున్నాయి. ఈ క్రమంలో తమిళనాడులో టీఎన్‌పీఎల్ జరుగుతోంది. అదే వరుసలో ఏపీలోనూ ఆంధ్రా ప్రీమియర్ లీగ్ పోటీలు నిర్వహించనున్నట్లు టాక్ వస్తోంది. 
 
ప్రస్తుతం ఈ లీగ్‌లో ఓ టీమ్‌ను కొనుగోలు చేసేందుకు ఆర్ఆర్ఆర్ నటుడు, మెగాస్టార్ తనయుడు, మెగా హీరో రామ్ చరణ్ ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. 
 
గత ఏడాది ప్రారంభమైన ఆంధ్రా ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ సక్సెస్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఈ లీగ్‌లో వైజాగ్ వారియర్స్ జట్టు కూడా ఆడుతోంది. ప్రస్తుతం వైజాగ్ వారియర్స్ పైనే రామ్ చరణ్ కన్నేసినట్టు టాక్ వినిపిస్తోంది.