శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 26 ఏప్రియల్ 2023 (16:33 IST)

ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ గన్ ఆసక్తి

NTR, James Gunn
NTR, James Gunn
రౌద్రం రణం రుధిరం (ఆర్.ఆర్.ఆర్.) సినిమా ఆస్కార్ వరకు వెళ్లడంతో అటు రామ్ చరణ్, ఇటు ఎన్టీఆర్ కు అవకాశాలు వస్తున్నాయి. జేమ్స్ కామారెన్ అయితే రాంచరణ్ ను మెచ్చుకొని  హాలీవుడ్ కు ఆఫర్ ఇచ్ఛడు. ఇప్పడు ఎన్టీఆర్ కు ఆ అవకాశం దక్కింది. తాజాగా గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ డైరెక్టర్ జేమ్స్ గన్, (ఆర్.ఆర్.ఆర్.లో తన నటనతో అద్భుతంగా ఉన్న తర్వాత ఎన్టీఆర్ తో కలిసి పనిచేయడానికి తన ఆసక్తిని వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 
 
జేమ్స్ గన్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. తాజాగా ఇండియన్ పబ్లికేషన్స్ తో మాటల్లో ఈ విషయం బయట పడింది. ఇండియా నుంచి అయితే గార్డియన్స్ యూనివర్స్ ఎవరినైనా ఇంట్రడ్యూస్ చేయాలి అంటే ఎవరిని చేస్తారనే ప్రశ్నకు  అడవి మృగాలతో జంప్ చేసిన ఆ వ్యక్తి తో అంటూ  ఆర్.ఆర్.ఆర్.లో ఎన్టీఆర్ అడవి మృగాలతో చేసిన సీన్ గురించి వివరించారు. గ్లోబల్ స్టార్ అయినా ఎన్టీఆర్ తో మరో సంస్థ కూడా సినిమా చేయడానికి ముందుకు వచ్చిందని తెలుస్తోంది.