సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 14 మే 2023 (16:34 IST)

వివాహ బంధాన్ని బలోపేతం చేసుకునేందుకు అమ్మ కావాలని అనుకోలేదు..

upasana
హీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదల తన తొలి మాతృదినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆమె ఓ భావోద్వేగభరితమైన ట్వీట్ చేశారు. వాసత్వాన్ని కొనసాగించడానికో, మా వివాహ బంధాన్ని బలోపేతం చేసుకోవడానికో తాను అమ్మను కావాలని అనుకోలేదని చెప్పారు. ఈ సందర్భంగా ఆమె బేబీ బంప్‌తో ఉన్న ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. తాను తొలి మదర్స్ డే జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. 
 
"మాతృత్వాన్ని స్వీకరించడానికి ఎంతో గర్వపడుతున్నా. నేను సమాజం అంచనాలకు అనుగుణంగా ఉండటానికో, వారసత్వాన్ని కొనసాగించడానికో, మా వివాహ బంధాన్ని బలోపేతం చేసుకోవాలనో నేను అమ్మను కావాలని అనుకోలేదు. అతులేని ప్రేమను నా బిడ్డకు ఇవ్వగలనని, జాగ్రత్తగా చూసుకోగలనని నేను మానసికంగా సిద్ధపడిన తర్వాతనే తల్లిని కావాలని నిర్ణయం తీసుకున్నా" అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చారు. 
 
ఉపాసన పెట్టిన ట్వీట్‌కు హీరోయిన్లు తమకు నచ్చిన విధంగా కామెంట్స్ చేశారు. కియారా అద్వానీ, సమంత, త్రిష, శ్రియ, సంయుక్త తదితరులు ఉన్నారు. హ్యాపీ మదర్స్ అండే అంటూ విషెస్ చెప్పారు.