శుక్రవారం, 13 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 4 మే 2023 (15:44 IST)

ఇలియానా బేబీ బంప్ వీడియో.. ఇన్ స్టాలో వైరల్.. తండ్రి ఎవరబ్బా?

Ileana
దేవదాసు చిత్రంలో తెలుగు తెరకు పరిచయమైన ఇలియానా ప్రస్తుతం తల్లి కాబోతోంది. తండ్రి ఎవరనే విషయం చెప్పకనే ఆమె తల్లి కాబోతున్నట్లు ప్రకటించింది. తాజాగా తొలిసారి బేబీ బంప్‌తో ఉన్న వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. 
 
రెండు వారాల కిందట చిన్నారి డ్రెస్సును, తన మెడలో మమా అని రాసి ఉన్న లాకెట్ ఫొటోలను షేర్ చేసింది. ఈ ఫోటోను చూసి ఎవ్వరూ నమ్మలేదు. అయితే ప్రస్తుతం బేబీ బంప్ వీడియో చూసి చాలా మంది షాకయ్యారు. 
 
గతంలో ఆస్ట్రేలియా ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్‌తో డేటింగ్ చేసిన ఇలియానా 2019లో అతని నుంచి విడిపోయింది. నటి కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ లారెంట్ మిచెల్‌తో ఇలియానా రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి.