1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 4 ఏప్రియల్ 2023 (10:10 IST)

ఆ కారణంతోనే పిల్లల్ని ఇన్ని రోజులు వద్దనుకున్నాం.. ఉపాసన

upasana
మెగా ఫ్యామిలీలో త్వరలో మరో వారసుడు రాబోతున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - ఉపాసన దంపతులు త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారు. నిజానికి వీరిద్దరికీ చాలా రోజుల క్రితమే వివాహం జరిగింది. కానీ సంతానం విషయంలో వీరిద్దరూ జాప్యం చేశారు. దీనిపై ఉపాసన తాజాగా క్లారిటీ ఇచ్చారు. 
 
పెళ్లయిన పదేళ్ల వరకు పిల్లలు వద్దనుకున్నామని అందుకే ప్రెగ్నెన్సీ ఆలస్యమైందని చెప్పారు. పెగ్నెన్సీ ఆలస్యం నిర్ణయం తామిద్దరిదీ అని చెప్పారు. పుట్టే పిల్లలకు తాను అన్నీ సమకూర్చగల స్థాయికి వచ్చానని ఉపాసన వివరించారు. 
 
"నేను చరణ్ మా మా రంగాల్లో పదిలంగా, స్థిరంగా ఉన్నాం. సమాజం, బంధుమిత్రులు, కుటుంబ సభ్యులతో ఒత్తిడితో కాకుండా నేను కావాలని కోరుకున్నపుడే గర్భం దాల్చడం సంతోషం కలిగింది" అని ఉపాసన వివరించారు.