శనివారం, 24 ఫిబ్రవరి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 9 మే 2023 (16:13 IST)

రామ్‌ చరణ్‌, కళ్యాణ్‌ రామ్‌ సినిమాలు వదులుకున్నా: వాసుకి

Vasuki
Vasuki
నటి వాసుకి తమిళ ప్రేక్షకులకు బాగా పరిచయం. సీరియల్‌ నటిగా పేరుతెచ్చుకున్న ఆమె రమణి వర్సెస్‌ రమణి, మర్మదేశం వంటి పాపులర్‌ ధారవాహికలో నటించింది. అదే ఆమెకు గుర్తింపు తెచ్చి పవన్‌కళ్యాన్‌ తొలిప్రేమలో ఆయన సోదరిగా అవకాశం దక్కించుకుంది. ఆ తర్వాత మరలా పెద్దగా సినిమాలు చేయలేదు. తెలుగులో పలుసినిమాలు వచ్చాయి. అయినా వద్దనుకున్నా. 
 
అందుకు కారణం. నా పిల్లల భవిష్యత్‌ కోసమే. 10వ తరగతిలో పిల్లలు వుండగా రామ్‌చరణ్‌, కళ్యాణ్‌రామ్‌ సినిమాలకు అకాశాలు వచ్చాయి. కానీ పిల్లల కెరీర్‌వైపు ఆ ప్రభావం పడుతుందని వదులుకున్నానని తెలియజేసింది. ఆ తర్వాత పిల్లల కెరీర్‌ చూసుకుంటూనే సైకాలజీలో పి.జి. చేశానంటూ తెలియజేసింది. 
 
అలాంటి వాసుకిని స్వప్నాదత్‌ తను తీయబోయే సినిమా అన్నీ మంచి శకునములే చిత్రానికి అగడటం వెంటనే ఆమె ఒప్పుకోవడం జరిగింది. ఈ సినిమాలో హీరో సంతోష్‌ శోభన్‌కు సోదరిగా చేసింది. ఈనెల 12న ఈ సినిమా విడుదలకాబోతుంది.