శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 13 జూన్ 2023 (09:57 IST)

అతను వున్న చోటే నాకు స్వర్గం.. తమన్నా

tamannah - vijay varma
బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ సంబంధంపై మిల్కీ బ్యూటీ తమన్నా ఎట్టకేలకు పెదవి విప్పింది. ఆయనతో ప్రేమ మాట నిజమేనని తమన్నా ఒప్పుకుంది. 
 
లస్ట్ స్టోరీస్2 వెబ్ సిరీస్‌లో తొలిసారి కలిసి నటించారు. అప్పటి నుంచి తమ మధ్య ప్రేమ చిగురించిందని తమన్నా చెప్పుకొచ్చింది. 
 
కేవలం సహనటుడు అనే కారణంగా విజయ్ వర్మను ఇష్టపడలేదని, తను చాలా ప్రత్యేకమైన వ్యక్తి అని చెప్పింది. తాను తనకు రక్షణగా నిలబడతాడనే నమ్మకం వుందని తమన్నా చెప్పుకొచ్చింది. 
 
తన మనసుకు దగ్గరైన వ్యక్తి అతను అంటూ తెలిపింది. తను వున్న చోటే తనకు స్వర్గం అన్నట్లు తమన్నా వెల్లడించింది.