సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్

మరదలితో వివాహేతర సంబంధం.. పెళ్లి కుదరడంతో బావ దారుణం

murder
తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం పోతినీడుపాలెం గ్రామంలో జరిగింది. మరదలితో వివాహేతర సంబంధం పెట్టుకున్న బావ  (అక్క భర్త) దారుణానికి పాల్పడ్డాడు. మరదలికి పెళ్లి కుదరడంతో ఇక తనకు దక్కదని భావించి హత్య చేసేందుకు ప్రయత్నించాడు. ఆ తర్వాత ఆమె చనిపోయిందని భావించి ఆత్మహత్య చేసుకున్నాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పోతినీడుపాలెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి భార్య, ఇద్దరు కుమార్తెలు. అతని అక్కాబావ మృతి చెందగా వారి కుమారుడు పెదపూడి సత్యనారాయణను చేరదీసి పెద్ద కుమార్తెనిచ్చి 8 నెలల క్రితం పెళ్లి చేశాడు. సత్యనారాయణ మామతో కలిసి గ్రామంలో సెలూన్ షాపుతో పాటు ఆర్కెస్ట్రా నిర్వహిస్తున్నాడు. 
 
ఆర్కెస్ట్రాలో పాటలు పాడేందుకు తన మరదలిని తీసుకెళ్లేవాడు. ఆ క్రమంలో వీరి మధ్య వివాహేతరబంధం ఏర్పడింది. కాగా ఇటీవల మరదలికి పెళ్లి కుదిరింది. పెళ్లయితే ఆమె తనకు దక్కదని కక్ష పెంచుకున్నాడు. శుక్రవారం రాత్రి గ్రామశివారుకు తీసుకెళ్లి చాకుతో గొంతుపై పలు మార్లు పొడిచాడు. ఆమె చనిపోయిందని భావించిన సత్యనారాయణ తన భార్యకు ఫోన్ చేసి మరదలి మృతదేహాన్ని తెచ్చుకోమని, తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పాడు. 
 
ఆమె ఇచ్చిన సమాచారంతో కుటుంబ సభ్యులు యువతిని వెంటనే తాడేపల్లిగూడెం ఆసుపత్రికిలించారు. కాగా.. సత్యనారాయణ భీమడోలు-కోం డ్రుపాడు రైల్వే గేటు వద్ద రైలు కిందపడి ఆత్మ హత్య చేసుకున్నాడు. ఈ సంఘటనలపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.