చంద్రబాబుతో భేటీ.. 12న టీడీపీలో చేరుతా.. ఆనం రాంనారాయణ రెడ్డి
వైసీపీ రెబల్ ఎమ్మెల్యే ఆనం రాంనారాయణ రెడ్డి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో భేటీ కావడం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. దాదాపు గంటపాటు ఆనం రాంనారాయణ రెడ్డి చంద్రబాబుతో భేటీ అయ్యారు.
ఈ భేటీ అనంతరం ఆనం టీడీపీలో చేరికపై కీలక ప్రకటన చేశారు ఆనం రాంనారాయణ రెడ్డి. టీడీపీ నేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర నెల్లూరు జిల్లాకు కూడా రానుంది.
అయితే పాదయాత్రను విజయవంతం చేసి పార్టీలో చేరతానని ఆనం ప్రకటించారు. చంద్రబాబుతో భేటీ అయ్యాక టీడీపీలో చేరడంపై ఆనం హర్షం వ్యక్తం చేశారు.